భారతదేశంలో పుట్టి ఎంతోమంది తమ ప్రతిభతో విదేశాల్లో కి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కేవలం తమ ప్రతిభతో కష్టంతో మాత్రమే అంచెలంచెలుగా ఎదుగుతూ విదేశాల్లో మంచి పేరు సంపాదించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే భారతదేశం నుంచి వేరే ప్రపంచ దేశాలకు వెళ్లి అక్కడ ఉన్నప్పటికీ భారతదేశం పై ఉన్న ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గదు . ఎప్పుడు తమకు స్వదేశం  పై ఉన్న ప్రేమను ఏదో విధంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కొంత మంది కంటే విదేశాలలో ఉన్న వారికి ఎక్కువ దేశ భక్తి  ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.. ప్రపంచ దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళపై తాను బతుకుతున్నా స్వాతి అనే యువతి కరోనా వైరస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాధునిక సదుపాయాలు,చిటికెలో వచ్చే  పోలీసులు, క్రమశిక్షణగా ఉండే ప్రజలు, ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే మించిన వైద్య సదుపాయాలు... అన్నీ ఉండి కేవలం 30 కోట్ల జనాభా ఉండి కరోనా  వైరస్ ను కంట్రోల్ చేయలేకపోయాను  అమెరికా దేశం చేతులెత్తేసింది.. కానీ క్రమశిక్షణ లేని ప్రజానీకం.. సాధారణ వైద్య సదుపాయాలు.. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశం మాత్రం కరోనా  వైరస్ ను  నియంత్రించడంలో ఎంతగానో విజయం సాధించింది అంటూ ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 

 

 ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన యువతి 24 గంటల్లో అలా మాట్లాడడం తప్పు అంటూ మళ్ళీ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది. దీనికి  కారణం.. భారతదేశంలో ఉండే కొంతమంది ప్రబుద్ధులు. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమెపై కామెంట్లు చేయడం. ఏ దేశం లో ఉన్నప్పుడు ఆ దేశాన్ని ప్రేమించాలని.. ఇతర దేశాల  గురించి గొప్పగా మాట్లాడకూడదు అంటూ క్లాస్ పీకడం.. ఇలాంటివి చేయడం వల్ల భారతదేశం గురించి గొప్పగా చెప్పిన సదరు యువతి మళ్లీ తర్వాత రోజు తన మాటలను వెనక్కి తీసుకున్నట్లు చెప్పి క్షమాపణలు చెప్పింది. అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యం మనదేశంలో మాత్రమే ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: