ఇండియాలో మొదటి కరోనా కేసు నమోదయిన కేరళ లో ఇప్పుడు కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చింది.  ఈనెల ప్రారంభమయ్యే ముందు వరకు అన్ని రాష్ట్రాల కంటే కరోనా కేసుల్లో ముందున్నాకేరళ లో ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దానికి అక్కడి సీఎం పినరయి విజయన్ తీసుకున్న చర్యలు ఓకారణం కాగా  ప్రజల సహకారం మరో కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావడం అలాగే కరోనా గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిపించడంతో  కేరళ అతి త్వరలో కరోనా ఫ్రీ స్టేట్ గా మారనుంది. ఇక నిన్నరాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని అలాగే 36మంది కోలుకున్నారని విజయన్ ట్వీట్ చేశారు. 
 
 
ఇప్పటివరకు కేరళ లో కరోనా సంఖ్య 375కు చేరగా అందులో 179 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు అక్కడ ఒక్క కరోనా మరణం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 194 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం తో దశల వారిగా లాక్ డౌన్ ను ఎత్తివేయడానికి అక్కడి ప్రభుత్వం రెడీ అవుతుందని సమాచారం.
 
ఇక కేరళ లో ఇలా ఉంటే మిగితా రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణం లో నిన్న ఒక్కసారిగా తెలంగాణలో 28 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు తెలంగాణ లో కేసుల సంఖ్య  531కు చేరగా 16 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: