కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే దాంతో మందు బాబులు మద్యం దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే  అస్సాం లో మాత్రం నేటి నుండి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఉదయం10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే మద్యం అమ్మాలని అదికూడా సామాజిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేసుకోవాలని అలాగే అనుమతించిన రోజుల్లోనే మద్యం అమ్మకాలు జరుగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో లాక్ డౌన్ ను పొడిగించిన సీఎం కేసీఆర్ మద్యం దుకాణాలు  తెరిచే ప్రస్తకే లేదని తేల్చి చెప్పాడు. మద్యం బాబులు  మాత్రం కనీసం రోజుకు రెండు గంటలైనా తెరిచేలా చూడాలని విజ్ణప్తి చేస్తున్నారు. ఇక ఆంధ్రా లో లాక్ డౌన్ పొడిగింపు పై నిర్ణయం తీసుకోలేదు కానీ అక్కడ కూడా  మద్యం పూర్తిగా బంద్ అయ్యింది.
 
ఇదిలావుంటే రేపటి తో దేశ వ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగియనుంది.అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం తో సంబంధం లేకుండా లాక్ డౌన్ ను ఈనెల 30వరకు పొడిగించాయి. రోజు రోజు కు దేశంలో కరోనా కేసులు ఎక్కువతుండడం తో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించడానికి మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో కొన్నింటికి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉందని సమాచారం. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8000 దాటింది. అందులో 250కిపైగా మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ , తమిళనాడు, రాజస్థాన్ ల్లో ప్రస్తుతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: