కరోనా వైరస్ నియంత్రణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రజలంతా కూడా కేంద్రం మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటన చేయడం మనకు తెలిసిన విషయమే. అంతేకాదు.. ఈ కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుందో అని రెండు నెలలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్ని కూడా ముందుగానే తెచ్చిపెట్టుకున్నరు. 

 

అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలంతా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు.. అయితే ఈ మూడు నెలలకు వచ్చే మూడు గ్యాస్ సిలిండర్లు పూర్తిగా ఉచితం కావడం శుభవార్త అనే చెప్పాలి. ఇంకా ఈ తరహాలోనే మరో కీలక ప్రకటన విడుదలైంది. అది ఏంటి అంటే? ఈ మూడు నెలల్లో వారికీ 8 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని.. 

 

ఆశ్చర్యంగా ఉందా? నిజమే.. ఆశ్చర్యమే.. కానీ కేంద్ర ప్రకటించినట్టు ఇచ్చే 8 గ్యాస్ సిలిండర్లు 14.2 కిలోల సిలిండర్లు కాదు.. అవి అన్ని కూడా గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్‌ అది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంట గ్యాస్‌ను ఉపయోగించే 8 కోట్ల మంది పేదలకు మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమయంలో మూడు నెలలకు గాను 14.2 కిలోల మూడు సిలిండర్లు మూడు ఇస్తున్నట్టు గతంలో  ప్రకటించిన కేంద్రం ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేసింది. అదే 5 కిలోల వంట గ్యాస్‌ను ఉపయోగించే వినియోదారులకు రాబోయే మూడు నెలల్లో ఎనిమిది సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో 5 కేజీల సిలిండర్లు వినియోగించేవారి స్పష్టత వచ్చింది. కాగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు దీని అర్హులు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: