ఎన్ని రోగాలు వచ్చిన, ఎంత మంది చచ్చిన లోకంలో మనుషుల తీరు మారదు.. చచ్చేవాడు చస్తూనే ఉన్నాడు. పుట్టేవాడు పుడుతూనే ఉన్నాడు.. తప్పులు చేసే వారు చేస్తూనే ఉన్నారు.. కాలం ఎవరి కోసం ఆగదు.. దాని పని అది చేసుకుంటు వెళ్లుతుంది.. అందుకే అప్పుడప్పుడు గాడితప్పుతున్న మనుషులను దారిలో పెట్టేందుకు ఇలాంటి విపత్తులు వస్తుంటాయి..

 

 

అయినా గానీ మనుషుల్లో మార్పు రావడం లేదు.. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లుతూనే ఉన్నాడు.. ఇకపోతే పెళ్లి అనేది సమాజంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన కట్టుబాటు.. దాన్ని కాలదన్ని విచ్చలవిడిగా అక్రమసంబంధాలకు ఎగబడుతున్నారు కొందరు.. కానీ దాని పర్యావసనం చివరికి ప్రాణాలు తీస్తుంది.. అది తెలిసి కూడా క్షణికమైన సుఖాల కోసం ప్రాకులాడుతున్న వారున్నారు.. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటనలో కూడా ఇలాంటి పరిస్దితే ఎదురైంది.. కానీ వెరైటిగా ప్రియురాలే ప్రియున్ని చంపింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని హెచ్‌.ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో.. కందులపాడుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది.. అయితే ఈ ఇద్దరికి అప్పటికే వివాహాలు అవగా, ఆ మహిళ ప్రియుడి మోజులో పడి, కట్టుకున్న భర్తతో విడిపోయి, కందులపాడు అడ్డరోడ్డు వద్ద బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంది.. ఎల్లకాలం ప్రకృతి పచ్చగా ఉండదు కదా.. అలాగే వీరి వ్యవహారంలో కూడా చిన్నపాటి గొడవలు జరిగాయి.. దీంతో కోటేశ్వరరావు కొద్దిరోజులుగా ఆ మహిళకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.. అయినా అతన్ని మరచిపోని ఆ మహిళ పదేపదే ఫోన్ చేసినా, ఇతరులతో కబురు పెట్టినా అతడు స్పందించడం లేదు.

 

 

చివరికి ఆమె నసపడలేక ఆదివారం మరొక వ్యక్తిని వెంట పెట్టుకుని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తనను ఎందుకు దూరం పెట్టావంటూ ఆ మహిళ కోటేశ్వరరావుతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వివాదం పెద్దదైంది. దీంతో ఆవేశం ఆపుకోలేక ఆ మహి కోటేశ్వరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో షాకైన అతడి ఫ్రెండ్ చుట్టుపక్కల వారి సాయంతో మంటలను ఆర్పివేసి జి.కొండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శరీరం చాలాభాగం కాలిపోవడంతో కోటేశ్వరరావు మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.. చూశారా మనది కాని దాన్ని మనదానిగా భావిస్తే చివరికి మిగిలేది బూడిదే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: