దేశంలో రోజ రోజకీ కరోనా ఏ రేంజ్ లో వ్యాప్తి చెందుతందో కేసులు, మరణాల రేటును బట్టి చెప్పొచ్చు. దేశంలో కరోనాని పూర్తి అరికట్టే ఉద్దేశ్యంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  వాస్తవానికి ఈ నెల 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. కరోనా పెరుగుదల పూర్తి స్థాయిలో అరికట్టకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.  దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

అయితే కరోనా ని అరికట్టే నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం రోజు రోజుకీ ఈ పెరుగుదలకు మూలకారం అవుతున్నాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ వైఖరేంటో వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకోబోయే నిర్ణయాన్నే రాష్ట్రంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు.  విద్య, ఆర్థిక, వ్యవసాయం, నీరు, నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి కమిటీలను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

కాగా, ప్రభుత్వ, ప్రజా సంబంధిత పనులను సామాజిక దూరం పాటిస్తూ ఎలా చేయవచ్చో ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య అధ్యక్షతన నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. ఇదిలా ఉంటే కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ పెంచినప్పటికీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారికి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉందని అంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: