ప్రేమ పేరుతో మోసం మరోసారి జరిగింది. ప్రేమించిన తర్వాత మోసం చేసి పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రియుడు యువతిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బయటకు వచ్చింది. అయితే అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను కలవడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. 

 


చింతపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియని పెద్దలు యువతికి మరో వ్యక్తితో పెళ్లిని ఫిక్స్ చేసారు. అయితే ప్రియుడి కోసం ఆ మోసగాడి ఒత్తిడితో ఆమె ఆ పెళ్లిని సైతం రద్దు చేయించింది. అయితే కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోమని యువతి అడగగా మాయమాటలు చెప్పి అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. 

 


అయితే శనివారం రాత్రి పని మీద బయటకు వెళ్లిన సదరు యువతిని ఆపి ప్రియుడు ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కేకలు విన్న ఆమె సోదరుడు వెంటనే అక్కడికి రాగ అతడిపై దాడి చేసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనితో బాధితురాలు ఆ సంఘటన నుండి తేరుకొని వెంటనే చింతపల్లి పోలీసులకు దీనిపై సమాచారాన్ని తెలిపి అక్కడ ఫిర్యాదు చేసింది. దింతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు.

 


ఏది ఏమైనా ఇలాంటి దుర్మార్గులకు ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అలాగే ఎన్ని కఠిన చట్టాలు చేపట్టిన వారు మాత్రం మారడం లేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం చేపట్టే కఠిన నిర్ణయాలు కాళ్ళలకు అద్దం పట్టేలా నిర్ణయాలు తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలంటే గజ గజ వణుకు రావాలి. ముఖ్యంగా దిశ చట్టంలో అమలు చేసిన వీటిలో శిక్షలు కఠినంగా అమలు చేస్తేనే ఇటువంటి వారికి తగిన శాస్తి జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: