కరోనా కష్టకాలం లో పేదలకు అండగా విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నీహార దీక్ష చేపట్టారు . అయితే లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది పేదలు, వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు, వలస కూలీలు జీవనోపాధి దొరక్క అగచాట్లు పడుతున్నారు వారికోసం కనీసం 5 వేలు చొప్పున అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతి పక్షం టీడీపీ ఇప్పటికే కోరింది .కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతి స్పందించక పోవడం తో టీడీపీ నేత ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నిరాహార దీక్షను మొదలు పెట్టారు.  

 

అయితే టీడీపీ పక్షాలు ఈ దీక్షకు సంగీభావం తెలుపుతున్నట్లు సమాచారం. విజయవాడ ఎమ్మెల్యే ఇప్పటికే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సవాల్చేసిన విషయం తెలిసిందే  తనకు ఓ ఛాన్స్ ఇస్తే విజయవాడ నగరం మొత్తం శానిటైజ్ చేస్తా అంటూ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు నష్టపోతున్నారని వారికీ పూటగడవని పరిస్థితి ఉందని అందువలన ప్రతి ఒక్కరి కి 5 వేల రూపాయలు పరిహారం అందించాలని కోరుతూ తనఇంట్లోనే 12 గంటల నిరాహార దీక్షకు దిగారు . ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్  మరియు అయన సతీమణి గద్దే అనురాధ నిరాహార దీక్ష ఇవాళ ఆయన ఇంట్లో ప్రారంభించగా వారికీ కి సంగీభావంగా స్థానిక ఎంపీ కేశినేని నాని మరియు అయన కుమార్తె కేశినేని శ్వేతా దీక్షలో పాల్గొన్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: