దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పది సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ ధనవంతుడిగా కనిపించలేదు. తన తండ్రి మరణానంతరం జగన్ సామాన్యుడిలా మారిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి... ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో ఎల్లవేళలా తిరుగుతూ అందరినీ తన సొంత కుటుంబంగా చూసుకుంటూ అసలు సిసలైన గొప్ప పరిపాలకుడిగా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారు.


భారతదేశం మొత్తంలో యంగ్, ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ సిఎం ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే... ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా జగన్ పేరే చెబుతారు. డిగ్నిఫైడ్ ప్రొఫైల్, చెక్కుచెదరని తేజస్సు ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సినిమా హీరో లా కనిపిస్తారు. కానీ తాను ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవిని సంపాదించారో అప్పటినుండి అతి సాధారణమైన ఫుల్ హాండ్స్ తెల్ల చొక్కా ని ధరించడం ప్రారంభించారు.


పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుండి జగన్ మోహన్ రెడ్డి దాదాపు మూడేళ్లుగా ఫుల్ హాండ్స్ తెల్ల చొక్కా, బూడిద రంగు గల పాంట్స్, సింపుల్ గా కనిపించే చెప్పులను మాత్రమే ధరించేవారు. ఆయన వేసుకునే గ్రే కలర్ పాంట్స్ లలో 3 రకాల షేడ్స్ ఉంటాయి. అయితే సాధారణంగా కనిపించే జగన్ డ్రెస్సింగ్ స్టైల్ నిన్న ఆదివారం నాడు ఒక్కసారిగా చేంజ్ అయింది. ఈ ఆదివారం ఉన్నత అధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్మోహన్ రెడ్డి తెల్ల చొక్కానే ధరించారు కానీ ఆ చొక్కా యొక్క కాలర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అలాగే తాను ధరించిన ప్యాంటు స్టైల్ కూడా సూపర్ గా మారిపోయింది.


అయితే ఈ డ్రెస్సింగ్ స్టైల్ వెనుక కారణం ఏంటని శోధించగా... నిన్న ఈస్టర్ పండుగ అని అందుకే జగన్ న్యూ లుక్ లో దర్శనం ఇచ్చారని తెలిసింది. ఏది ఏమైనా ఈ న్యూ లుక్ చాలా బాగుందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. బహుశా జగన్ మోహన్ రెడ్డి ఈ న్యూ డ్రెస్స్ స్టైల్ ని పర్మనెంట్ డ్రెస్సింగ్ కోడ్ లాగా మార్చుకుంటారో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: