ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టాడనికి ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ రేపటితో (ఏప్రిల్ 14) తో ముగియనుంది. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ పొడగింపు, కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.


ఏప్రిల్ 14 తరువాత విధించే లాక్ డౌన్ ను 'లాక్ డౌన్ 2.0' గా పీఎంఓ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక లాక్ డౌన్ 2.0 లో చాలా వరకు సడలింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.


లాక్ డౌన్ 2.0 లో వీటికి మినహాయింపు ఇవ్వనున్నారు


1. లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు మూతపడ్డ పరిశ్రమలకు లాక్ డౌన్ 2.0 లో మినహాయింపు ఇవ్వనున్నారు. పరిమిత కార్మికులతో పరిశ్రమలను నడుపుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన ఉత్పత్తి నష్టాన్ని పూడ్చేందుకు గానూ కార్మికుల పని వేళలు పెంచే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.


2. లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడే చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి స్వస్థలాలకు చేర్చనున్నారు.


3. నిత్యావసరాల దుకాణాల పని వేళలు పెంచనున్నారు.


4. పరిమిత సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కు అనుమతి ఇవ్వనున్నారు.


5. నిత్యావసరాల సరుకుల రవాణా చేసే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.


6. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేయనున్నారు.


7. సామజిక దూరం పాటిస్తూ రోడ్లపై పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: