దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్ని రంగాలకు వెసులుబాటు ఉన్నా...మెజార్టీ ప్రజలు ఇళ్లకు పరిమితం కావాల్సిందే. దీంతో చేతిలో ఉండే సెల్ ఫోన్ కి అంతా అలవాటు అయిపోయారు. ఇదేం కొత్త కాదు కానీ...నెట్ వినియోగం మరింత పెరిగింది. లాక్ డౌన్ తో అన్ని రంగాలు నష్టాలకు గురైనా నెట్ వర్క్ అందించే కంపనీల ఆదాయానికి కొదవలేదు. దేశంలో విపరీతంగా నెట్ వినియోగం పెరిగింది. దీంతో నెట్ వేగం కూడా తగ్గింది.

 

దేశంలో 687 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. వీరిలో 22.2 మిలియన్లు మాత్రమే వైర్ బ్రాడ్ బాండ్ వినియోగిస్తున్నారు. మిగిలిన వారంతా మొబైల్... లేదంటే వైర్ లెస్ ఇంటర్నెట్ ని వినియోగిస్తున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మార్చి 22 నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంలో పాటు...దీన్ని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ని మరో రెండు వారాలు కూడా పొడిగించాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇదే అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీంతో విద్యా., వైద్యం ఆరోగ్యం అన్ని రకాలుగా ఆన్ లైన్ మీదే ఆధారపడిపోయాయి. దేశంలో సాధారణ రోజుల్లో నిత్యం వ్యక్తి మూడు గంటల పాటు నెట్ ని వినియోగించేవారు. కానీ ఇప్పుడు దాని వినియోగం ఐదు గంటలకు పెరిగింది. అన్ని ప్రైవేట్ సెల్యూలార్ కంపెనీల్లో వాడకం... 30 శాతం పెరిగింది. 

 

వినియోగం ఎక్కువ అవ్వటంతో నెట్ స్పీడ్ తగ్గిపోయింది. ప్రధాన నగరాల్లో నెట్ వేగం 20 శాతం తగ్గిపోయింది. వీడియోల వినియోగం కూడా 30 శాతం^వరకు పెరిగింది. లాక్ డౌన్ మూలంగా అందరూ ఇళ్లకే పరిమితం కావటంతో సినిమాలు.... ఇతర భాషలకు సంబందించిన వీడియోలు... లెర్నింగ్ కి సంబందించిన వీడియోల వాడకం ఎక్కువగా ఉంది. దీంతో నెట్ స్పీడ్ విపరీతంగా తగ్గిపోయింది. లాక్ డౌన్  పొడిగింపుతో  నెట్ స్పీడ్  25 నుంచి 30 శాతానికి^కూడా పెరిగే అవకాశం ఉంది.  ప్రస్తుత వినియోగం కంటే...30 నుంచి 40 శాతానికి పెరిగే అవకాశం లేకపోలేదు. నెట్ వినియోగం  హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో పెరిగిపోయింది.

 

నెట్ వినియోగంలో ఎక్కువగా ఉపయోగించే సమయం కూడా గుర్తించాయి కంపనీలు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు...,సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు నెట్ వినియోగిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో... స్పీడ్ తగ్గిపోయింది.  మెట్రో నగరాలు, రెసిడెన్షియల్ జోన్లలో   వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో డౌన్ లోడ్ వేగం  25 నుంచి 30 శాతం వరకు తగ్గింది. ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా లాక్‌ డౌన్ కొనసాగుతుంది కాబట్టి...డౌన్ లోడ్ స్పీడ్ 35 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

 

లాక్ డౌన్ రెండు వారాల పాటు విధిస్తేనే ఇంటిల్లిపాది మొబైల్ ఫోన్లకు...ల్యాప్ టాప్.... కంప్యూటర్లకు అత్తుకుని పోయారు. ఇప్పుడు లాక్ డౌన్ ను పొడిగించడంతో...ఇంటర్నెట్ స్పీడ్ కూడా స్లో అవుతోంది. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వ్యవధి కూడా మరో గంట పెరిగే అవకాశం లేకపోలేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: