శృంగారం అనేది మ‌నిషి జీవితంలో ఓ భాగ‌మ‌ని చెప్పాలి. ఆయుర్వేదం మాత్రం మ‌నిషి శరీరం, మనసు, ఆత్మ వీటన్నింటి సమ్మిశ్రమంగా భావించి మనిషికి చికిత్స అందించాల‌ని చెబుతోంది.అదేవిధంగా సెక్సాలజీ కూడా మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని బోధిస్తోంది.


అంతేకాక మనిషి శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, అక్క‌డి ప‌ద్ధ‌తులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఆశయాలు వీటన్నింటిని ప‌రిగ‌ణించాల‌ని సూచిస్తోంది. శృంగారంలో పాల్గోవాలంటే భాగ‌స్వామి ఇష్టాలు కంప‌ల్‌స‌రీ తెలుసుకోవడం.. వాటికి త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎంతైనా అవసరం.

 

అయితే త‌మ ఇష్టాఇష్టాల గురించి  స్త్రీలు చెప్ప‌లేక‌పోవ‌చ్చు. కానీ వాళ్ళ క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి అర్ధం చేసుకోవాలి. అదే విధంగా శృంగారంలో ఉన్న‌ప్పుడు ఎక్కడ చేయి వేస్తే తీసి వేస్తున్నారు.. ఎక్కడ చేయి ఉంచుతున్నారు.. ఇలాంటివి కూడు పురుషుడు పరిశీలన ద్వారా తెలుసుకోవాలి. అలాగే సుఖ వ్యాధుల‌కు దూరంగా ఉండాలి.


 
కొంత మందికి పెళ్ళికి ముందు తర్వాత వేశ్యలతో తిరిగే అల‌వాటు ఉంటుంది. అలాంట‌ప్పుడు సుఖ వ్యాధుల బారిన ప‌డ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని, భార్యతో శృంగారంలో పాల్గొనాలి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ వివాహానంత‌రం వేశ్యతో శృంగారంలో పాల్గొన‌కపోవ‌డం చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం భార్య‌తో వివాదాలు కూడారావు. మంచి సుఖ‌సంసారం ఉంటుంది. అలాగే గర్భం వద్దనుకున్నప్పుడు గ‌ర్భ‌ నిరోధ‌క ప‌ద్ధ‌తులు గురించి ముందుగా తెలుసుకోవాలి. లేకుంటే గర్భం వస్తుందేమోన‌న్నభయం పాతుకుపోతే ఇద్దరూ శృంగారాన్ని త‌గిన రీతిలో ఆస్వాదించ‌లేరు. సెక్స్‌లో ఎలా తృప్తి పొందాలి? వీర్యస్ఖలనాన్ని నియంత్రించుకోవాడం ఎలా? భావప్రాప్తి పొందడం ఎలా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను మ‌గ‌వాడు త‌నంత‌ట తానే తెలుసుకోవాలి. అదేవిధంగా ఏవి కామోద్రేకాన్ని కలిగిస్తాయి.. ఏవి ఉద్దీప‌న శ‌క్తిగా ప‌నిచేస్తాయి.. అన్న‌వి కూడా.. క్ర‌మ‌క్ర‌మంగా అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకోవాలి.

 

అలాగే శృంగారం విష‌యంలో  కూడా చాలా పరిశుభ్రత పాటించాలి. ఆత్మవిశ్వాసం ప్ర‌ద‌ర్శించాలి. ఫోర్‌ప్లే అన్న‌ది కూడా స్త్రీ పురుషునికి కూడా చేయ‌గ‌ల‌గాలి.  జీవిత భాగ‌స్వామిపై ప్రేమానురాగాలు చూపడం ద్వారా ఆరోగ్యం ఇద్ద‌రి సంసారం సుఖంగా సాగుతుంది. శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయిన రోజు సెక్స్‌లో పాల్గొనకుండా.. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని వీలైతే తెల్లవారుజామున క‌ల‌యికలో పాల్గొంటే మంచిది. దాని కోసం భాగ‌స్వామిని ఎప్పుడూ ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: