త‌మ దేశంలో పుట్టిన క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న చైనాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌మ దేశంలోని వూహాన్‌లో కరోనా వైరస్‌ను పుట్టించి (?!) అనంత‌రం దాన్ని విజయవంతంగా (!) అదుపులోకి తెచ్చిన చైనాకు ఇప్పుడు దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గిలింది.  ఇప్పుడు విదేశాల నుంచి కరోనా వైర‌స్ వ‌స్తూ... ఆ దేశ ప్ర‌జ‌ల‌కు అంటిస్తున్నారు. చైనాతో ద‌గ్గ‌రి సంబంధాలు క‌లిగి ఉన్న ర‌ష్యా నుంచి చైనాకు క‌రోనా దిగుమ‌తి వ‌స్తోంది. గ‌త‌ రెండ్రోజుల్లో చైనాలో నమోదైన కరోనా కేసుల్లో సగం వరకు రష్యా నుంచి వచ్చిన చైనీయులవే కావడం గమనించదగ్గ విషయం.

 

 

రకరకాల కారణాల వల్ల రష్యాలో నివసించే చైనీయులు పెద్దసంఖ్యలో ఇప్పుడు స్వదేశం తిరిగి వస్తున్నారు. అయితే వారితోపాటుగా కరోనా కూడా దిగుమతి అవుతోంది. ప్రస్తుతం వారానికి ఒక విమానాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. రష్యా నుంచి భూమార్గం ద్వారా కూడా రాకపోకలు జరుగుతాయి. రష్యా సరిహద్దుల్లోని హైలోంగ్‌జియాంగ్ రాష్ట్రంలోని హార్బిన్ నగరానికి కరోనా తాకిడి అంతకంతకు ఎక్కువవుతోంది. షాంఘైలో శనివారం నమోదైన 52 కేసుల్లో 51 కేసులు బయటి నుంచి వచ్చిన చైనీయులవేనని ఆ నగర మునిసిపల్ కమిషన్ వెల్లడించింది. నగరంలో దిగిన తర్వాతనే వారికి కరోనా ఉన్నట్టు గుర్తించామని అంటున్నారు. విమానం వివరాలుగానీ, ఇతర వివరాలు గానీ తెలియరాలేదు.

 

ఇదిలాఉండ‌గా, లక్షల సంఖ్యలో బాధితులు, వేల సంఖ్యలో మరణాలు జరిగిన చైనాలోని వుహాన్‌ ప్రజలు త్వరగా కోలుకొనేందుకు అక్కడి ప్రభుత్వం క్వారంటైన్‌ పద్ధతిని కచ్చితంగా పాటించింది. అక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ వ్యాధిగ్రస్థుడు పూర్తిగా కోలుకొని తదనంతర వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా నెలపాటు దవాఖాన క్వారంటైన్‌లోనే ఉంచారు. పాజిటివ్‌ రోగులను అక్కడ కనీసం 60 నుంచి 70 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉంచి కేసుల సంఖ్య పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటి వారికి తాజాగా జ‌రుగుతున్న ప‌రీక్ష‌ల ఫ‌లితాలు షాక్ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: