ఉదయం లేచిన మొదలు పడుకొనేవరకు  మింగుడు పడని ఒక మాట ఈ మహమ్మారి కరోనా . ఎవరి నోటా కూడా ఒకటే మాట . కరోనా ఒక జబ్బు కాదు అనేక జబ్బుల సమ్మేళనం.. ఒక సారి కనుక ఈ కరోనా వైరస్ సోకితే జబ్బు దగ్గు  జ్వరం అంటూ ఇలా వరుస పెట్టి అన్నీ వస్తుంటాయి. అందుకే కారో పేరు వినగానే సకల జీవులు భయానికి గురవుతున్నారు. కరోనా ప్రభావం ప్రపంచాన్ని ఎంతగా తలక్రిందులు చేస్తుందో తెలిసిన విషయమే.. 

 

 


ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు.

 

 


మొత్తానికి పేద ప్రజల జీవనశైలిలో ఉన్న పేద ప్రజలు పరిస్థితి ఇంట్లో కూర్చుంటే పూట గడవని పరిస్థితి. అలాంటి వారిని ఆదుకోవడాని రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాల మంది ప్రజలకు విరాళాలను అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మై హోమ్స్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు విరాళాలు ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడే నిమిత్తం ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధులకు మూడు కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు.

 

 

 

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నారు.. కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా పై పోరాటం చేస్తున్నారు.. ఇలాంటి విపత్కర పరిస్థితులను  కూడా సమాజానికి తెలియపరుస్తున్న జర్నలిస్టులను అభినందిస్తూ వారిపై ఓ వ్యక్తి పాటను రాశారు.జర్నలిస్టన్న నీకు దండమన్నా.. సమాజ సేవ చేసే నీకు సలామన్న.. అంటూ సాగిన లిరిక్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి. దీంతో ఆ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: