ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా గురించి ప్రజలను ఎలెర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అయితే ఓ మంత్రి మాత్రం ప్రజలు ఇటు కరోనాతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటంపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నాకట మంత్రి సుధాకర్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డికె.శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా దెబ్బకు ప్రపంచం అంతా విలవిల్లాడుతుంటే మంత్రి, డాక్టర్ సుధాకర్ స్విమ్మింగ్ పూల్‌లో ఆటలు ఆడుకుంటున్నారని విమర్శించారు.
అలాగే సుధాకర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా శివకుమార్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇక ఏ సుధాకర్ మీద అయితే విమర్శలు వస్తున్నాయో సదరు మంత్రి ప్రస్తుతం రాష్ట్ర కరోనా వివరాల వెల్లడి ఇన్చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తన పిల్లలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక అంతకు ముందు మంత్రి సుధాకర్ చాలా రోజుల తర్వాత పిల్లలతో కలిసి ఈతకొడుతున్నా... ఇక్కడ కూడా భౌతిక దూరం పాటిస్తున్నా హ హా అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ మెసేజ్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన శివకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కాగా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌లో సుధాకర్ కూడా ఒకరు. బీజేపీ సర్కారు ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆయనను మంత్రిమండలిలోకి తీసుకున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple