రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు జరుపుతున్నారని.. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని.  వైఎస్ జగన్ ప్రజలను నమ్ముకున్న ప్రజానేత అందుకే ప్రజల విషయంలో ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడని అన్నారు కొడాలి నాని.  ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండో విడతలో భాగంగా 5 కిలోల బియ్యం, కేజీ శనగలు ఇస్తామని చెప్పారు.

 

14 వేల రేషన్ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రేషన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  రేషన్ కూపన్ పై ఉన్నఆయా తేదీల్లో మాత్రమే వినియోగదారులు రేషన్ దుకాణాల వద్దకు రావాలని సూచించారు. అంతే కాదు రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ నేరుగా వారి గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తుందని, గ్రామసచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.  

 

రాష్ట్రంల్లో కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.   ఈ సందర్భంగా చంద్రబాబు పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా హైదరాబాద్ లో దాక్కొని తనదైన శవరాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాదని అన్నారు. గద ఐదేళ్లుగా చంద్రబాబుదు ప్రచార ఆర్భాటమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: