భారత్‌లో గ‌డిచిన 24 గంటల్లో 796 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక  35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో  9152 క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాతో బాధ‌ప‌డిన వారి సంఖ్య 308గా ఉంది. దేశంలో 7987 యాక్టివ్ కేసులు ఉండగా.. 856 ఇప్పటి వరకూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడిన వారిలో 72 మంది విదేశీయులు కూడా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. 

 

దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై  కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో దేశంలో 35 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308కి చేరింద‌ని తెలిపారు.  మృతుల్లో మహారాష్ట్రకు చెందిన వారు 22 మంది ఉండగా.. గుజరాత్‌కు చెందిన ముగ్గురు, బెంగాల్‌కు చెందిన ఇద్దరు, తమిళనాడు‌కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,152కు చేరుకోగా వీరిలో 857 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ల‌వ్ అగార్వాల్ తెలిపారు. 

 

 కాగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. టెస్టింగ్‌ కిట్లు కూడా మరో 6 వారాలకు సరిపోయేలా అందుబాటులో ఉన్నట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 18.5 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా 1.14 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధికంగా కరోనా బాధితులు ఉండగా.. ప్రాణ నష్టం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది.  ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వరకూ కొనసాగుతుంది. రేపు ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి మోదీ లాక్‌డౌన్ కొనసాగించబోతున్నామని కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: