ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. రోజుకు దాదాపు వంద కు పైగా కేసులు నమోదు చేస్తూ మహారాష్ట్ర , ఢిల్లీ తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు చేసిన మూడో రాష్ట్రం గా తమిళనాడు నిలిచింది. ఇప్పటివరకు తమిళనాడు లో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇక రోజు రోజు కు కేసులు ఉదృతి పెరుగుతుండడం తో ఈరోజు కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం పళనిస్వామి లాక్ డౌన్ ను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.  అంతేకాదు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నామని సీఎం వెల్లడించారు. అయితే ఇంతకుముందు లాగే 15నుండి అమలులోకి రానున్న లాక్ డౌన్ లో కూడా ఫుడ్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చారు అలాగే  బేకరీ షాప్ లకు కూడా పర్మిషన్ లభించింది. ఉదయం 6 గంటల నుండి మధ్నాహం ఒంటి గంట వరకు బేకరీ లు ఓపెన్ చేసుకోవచ్చని  ప్రభుత్వం తెలిపింది. 
 
 ఇదిలావుంటే రేపటి తో కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ముగియనుంది అయితే కేంద్రంతో సంబంధం లేకుండా ఇప్పటికే  తమిళనాడు తోపాటు ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర , కర్ణాటక, పశ్చిమ బెంగాల్  ఈనెల 30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇక రేపు ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.  దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే లాక్ డౌన్ పొడిగించడానికే కేంద్రం కూడా మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది కానీ అత్యవసర సేవలతో పాటు మరి కొన్నింటికి కూడా లాక్ డౌన్ నుండి  మినహాయింపు లభించనుందని సమాచారం. ప్రస్తుతం  దేశంలో కరోనా కేసుల సంఖ్య 9000 దాటింది. అందులో 300కు పైగా కరోనా బాధితులు మరణించగా 1000మందికి పైగా కోలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: