క‌రోనా వైరస్ పుణ్యమా అని ప్రస్తుతం దేశంలో ఒక రకంగా లాక్‌ డౌన్ బాగానే జరుగుతుంది. ఈ లాక్ డౌన్ కార‌ణంగా మన దేశంలో చాలా వరకు కాలుష్యం స్థాయిలు గ‌ణ‌నీయంగా త‌గ్గిన సంగ‌తి అందరికి తెలిసిన విషయమే. అయితే అది ఎంతలా అంటే ముఖ్యంగా గంగానది చాలా శుభ్రంగా మారిపోయింది. లాక్ డౌన్ కు ముందు ఆ న‌ది చుట్టూ ఉన్న ప‌రిశ్ర‌మ‌లు, హోట‌ల్స్ త‌దిత‌రాల వ‌ల్ల ఆ న‌దిలోని నీరు కాలుష్యంగా మారిపోయింది. అయితే ఇప్పుడు లాక్‌ డౌన్ కార‌ణంగా ఆయా ప్ర‌దేశాల‌న్నింటినీ పూర్తిగా మూసేశారు. దీనితో కాలుష్య చాలా వరకు త‌గ్గింది. దీని వలన గంగాన‌ది పూర్తిగా శుభ్రంగా మారిపోయింది.

 


అయితే గంగాన‌దిలో కాలుష్యం కాస్త త‌గ్గ‌డంతో పాటు న‌దిలో నీటి స్థాయిలు బాగా పెరిగాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ప్ర‌స్తుతం న‌దిలోని నీటిని తాగ‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. ప్రస్తుతం గంగానదికి చెందిన ప‌లు ఫొటోల‌ను కూడా నెటిజ‌న్లు షేర్ చేసి.. న‌ది ఎంత‌గా శుభ్రంగా మారిందో.. అస‌లు ఇలాంటి స్థితిని కలలో కూడా చూస్తామ‌నుకోలేద‌ని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు గంగా న‌ది ఇంత పరిశుభ్రంగా మారినందుకు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

 


మరికొంద‌రైతే.. మ‌నిషి చేసిన త‌ప్పుల వ‌ల్లే గంగాన‌ది కాలుష్య భ‌రితంగా మారింద‌ని, కాకపోతే ఇప్పుడు ఆ న‌ది శుభ్రంగా మార‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయన అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం గంగాన‌ది ఫొటోలు నెట్‌ లో ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే లాక్ డౌన్ దెబ్బకి దేశంలో వాతావరణ పరిస్థితులు చాలా వరకు మెరుగయ్యాయి. ఇక అడవుల విషయానికి వస్తే అటువైపు మనుషులు తెలియకపోవడంతో అడవిలోని జంతువులు స్వేచ్ఛగా రోడ్ల మీదికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: