తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే ఆర్ కే రోజా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నా... చాలామంది పచ్చ మీడియా, పచ్చ పత్రికల వాళ్ళు కావాలనే ఆయనపై నెగటివ్ గా వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడింది. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర సీఎం కరోనా పై పోరాటం చేయలేనంతగా... జగన్ మోహన్ రెడ్డి ఓ పక్కా ప్రణాళికతో ధైర్యంగా ముందుకు వెళుతున్నారని... అటువంటి మనిషిని పొగడకపోయినా పర్వాలేదు కానీ... నిందించడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఆమె అన్నారు.


తాజాగా నగరి నియోజకవర్గం లో వడమాల గ్రామంలో ఎమ్మెల్యే రోజా కరోనా రక్షణ వస్తువులను ధరించి... ఆ గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటిని, ఇంకా పరిసర ప్రాంతాలలోని ఇళ్లకు సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తూ స్థానిక ప్రజలకు ధైర్యం చెబుతూ అవగాహన కల్పించారు. ఐతే నెటిజన్లు ఈ సంఘటనపై చెడుగా కామెంట్లు చేశారు. PPE( ప్రత్యేకత రక్షణ వస్తువు), మాస్కులు లేక సర్కారీ వైద్యులు అల్లాడుతుంటే మీరేమో కేవలం ఫోటోల కోసం మాస్కు ధరించి తప్పు చేస్తున్నారని కామెంట్లు చేశారు.


దీనిపై రోజా మాట్లాడుతూ... 'వాళ్లకి ఏమీ అర్ధమయ్యి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు కానీ... వాళ్లు మాత్రం తినింది అరక్క మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తిన్నది అరగకపోతే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోండి. అక్కడ ఏం జరుగుతుందో, మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే నాతోపాటు ఒక రోజు రాండి. అసలు పని చేయలేని సోమరిపోతులే ఇటువంటి కామెంట్స్ చేస్తారు. మీరు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి దుష్ప్రచారం చేసినంత మాత్రానా... ఎవరు నిజంగా కష్టపడుతున్నారో ఎవరు నటిస్తున్నారో జనాలకు తెలుసు. నేను వడ మాడ గ్రామంలో ప్రతి వీధిలో తిరుగుతూ స్ప్రే చేశాను. నేను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరినో ఒకరిని కావాలనే బ్యాడ్ చేయాలని చూస్తుంటారు. నిజానికి వారు గురిగింజ లాంటివాళ్ళు. వాళ్ల క్యారెక్టర్ లో ఉన్న లోపాలను వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్లు గానీ వాళ్ల నేతలు గానీ సమాజానికి దేనికి పనికి రారు. ఇటువంటి విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్న కొంతమందిని చూస్తుంటే చాలా చిరాకు పుడుతుంది' అని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: