త‌వ్విన కొద్దీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన లింకులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.క‌రోనా వ్యాప్తిని క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మైన అధికారుల‌కు మ‌ర్క‌జ్ లింకులు విస్తుగొల్పుతున్నాయి. భార‌త‌దేశం అంతాట మ‌ర్క‌జ్ భ‌వ‌న్ నుంచి కరోనా దిగుమ‌తి అయిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డి త‌ర్వాత ఆయా రాష్ట్రాల‌కు వెళ్ల‌డంతో అక్క‌డ లోక‌ల్ కాంటాక్టులతో వ్యాధి విస్తృత‌మైన‌ట్లు ఇప్ప‌టి కే అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మారో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఢిల్లీ మర్కజ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు కూడా యాత్రికులు వెళ్లినట్లు తెలుస్తోంది. 

 

 నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మతపెద్ద తొలుత ఢిల్లీకి వెళ్లారని ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే సదరు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన సమావేశానికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. మర్కజ్‌తో‌పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమాచారం కేంద్ర నిఘావర్గాల నుంచి రాష్ట్రాలకు చేరింది. దీని ఆధారంగానే స్థానిక నిఘా అధికారులు పోలీసులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.   ఢిల్లీలో జరిగిన సమావేశంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారిని సైతం స్క్రీనింగ్ చేయాలని నిఘావర్గాలు హెచ్చరించాయి.

 

ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. తాజాగా ఢిల్లీ నిఘావర్గాల హెచ్చరిక మేరకు ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మార్చి నెల చివరి దాకా అసలు కరోనా ప్రభావమే తెలంగాణ‌ జిల్లాల్లో కనిపించక పోగా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అందరూ నిన్నటిదాకా ఒక మర్కజ్ పైనే దృష్టి పెట్టారు. తాజాగా నిర్మల్ కేసులు వెలుగు చూసిన తర్వాత ఇక్కడి నిఘావర్గాలు ఉలిక్కిపడ్డాయి. దేవ్‌బంద్ అజ్మీర్ దర్గా వ్యవహారం గురించి కేంద్ర నిఘావర్గాలు హెచ్చరిస్తున్నా యి.  సమావేశాలకు వెళ్ళినవారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొంతమంది సమావేశాలకు వెళ్లి వచ్చినవారు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారనే సమాచారం కూడా ఆందోళనకు కారణం అవుతోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: