ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని పట్టి పీడిస్తుంది.   మహమ్మారి కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన ఆ దేశంలో రోజూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మందికి వైరస్ సోకింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే అగ్రరాజ్యంలో అత్యధిక ప్రాణ నష్టం వాటిల్లుతోంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మహా విపత్తు నెలకొని వుందని ఆయన వ్యాఖ్యానించారు.కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఉనికి చాటుకుంటూ విలయం సృష్టిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. దాంతో అనేక దేశాల ప్రజలు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. 

 

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇటీవలే భారత్ నుంచి 444 మంది తమ పౌరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లింది.  కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇతర దేశాల్లో ఉన్న మొత్తం 50 వేల మంది అమెరికన్లను స్వదేశం తీసుకు వెళ్ళడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయించారు. అయితే భారత్ లో మొత్తం 800 మంది అమెరికన్లు ఉండగా వారిలో కేవలం 11 మంది మాత్రమే అమెరికా వెళ్ళడానికి ముందుకు వచ్చారట. 

 

బతికుంటే బలుసాగ తినొచ్చన అమెరికా వెళ్తే ప్రాణాలు హరీ అనడం ఖాయం అంటున్నారు. తాము భారత్ లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు.   భారత్ లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండడమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది. కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా.

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: