చైనాలోని ఆహారపు అలవాట్లను కాసేపు పక్కన పెడితే.. వైరస్‌ రెండో దఫా విజృంభణకు మరిన్ని కారణాలు కూడా వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో వైరస్‌ ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో చైనా ఏ మాత్రం లైట్ తీసుకున్నా.. పరిస్థితి మొదటికి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ప్రపంచ దేశాలు కరోనా  పడగ నుంచి ఇప్పుడప్పుడే బయట పడేలా లేవు. అందుకే ఏదైనా దైశం ఈ వైరస్‌ నుంచి బయటపడిందని సంబరపడటానికి లేదు. అలాగే దేశంలో పరిస్థితులు కుదటపడ్డాయని  గేట్లు ఎత్తేసినా ఇబ్బందే. చైనాలో ఇప్పుడిదే జరిగిందంటున్నారు నిపుణులు. వివిధ దేశాల్లో చిక్కుకపోయిన పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనేక దేశాలు చర్యలు చేపట్టాయి. స్వదేశంలో అడుగుపెట్టిన వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్వారంటైన్‌కు పంపుతున్నాయి. చైనా కూడా ఇదే చేసింది.  కరోనా వ్యాప్తి తగ్గడం..కొత్త కేసులు నమోదు లేకపోవడంతో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన తమ వారిపై ఫోకస్‌ పెట్టింది. అయితే అలా వచ్చిన వారిలో చాలా మంది పాజటివ్‌గా తేలుతుండటంతో  కేసులు పెరుగుతున్నాయి. 

 

వైరస్‌ ఇంకా బుసలు కొడుతోంది. మరణాలు అంతే స్థాయిలో ఉన్నాయి. చాలా దేశాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ వెళ్తున్నాయి. ఈ వైరస్‌కు అంతెక్కడో తెలియక ఆవేదన చెందుతున్నారు వైద్యులు. వ్యాప్తిని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎవరో ఒకరు.. ఏదో ఒక ప్రాంతం  సూపర్‌ స్ప్రెడర్‌గా మారుతున్నారు. ఎపిక్‌ సెంటర్లుగా బయటపడుతున్నాయి. విదేశాల నుంచి విమాన మార్గాల్లో వచ్చే వారిని పక్కగా గుర్తించి వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని దేశాల మధ్య రైలు, రోడ్డు మార్గాలు విస్తృతంగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల నిఘా పక్కాగా ఉండకపోతే సమస్య చేయిదాటే ప్రమాదం ఉంది. 

 

చైనా, రష్యా మధ్య 4వేల 200 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది.  ప్రపంచంలోనే ఇది ఆరో అతిపెద్ద ఇంటర్నేషనల్‌ బోర్డర్‌. ఇలాంటి సరిహద్దు ప్రాంతాల్లోనే ఇప్పుడు కరోనా వైరస్‌ జాడలు పెరిగి.. రెండు దేశాలల్లోనూ ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులను పెంచేశాయి. దీనికితోడు చైనాలో దేశీయంగానూ అక్కడక్కడా కరోనా  బాధితులు స్వల్పంగా బయటపడుతున్నారు. అవి కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో కావడంతో స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. 

 

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత  వుహాన్‌లో  లక్షల మంది రోడ్డు, రైలు, విమాన మార్గాలలో ప్రయాణించారు. తగిన జాగ్రత్తుల తీసుకోకుండా రోడ్లపైకి వచ్చినా.. సామాజిక దూరం పాటించకపోయినా పరిస్థితి మళ్లీ మొదటికొ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. రెండోదఫా వైరస్‌ విజృంభణ గతంకంటే తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలం కరోనాతో యుద్ధం చేసేందుకు వీలుగా అక్కడి వైద్యనిపుణులను పాలకులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విదేశీలను ఎవ్వరినీ దేశంలోకి అనుమతించడం లేదు. కేవలం చైనా పౌరులు మాత్రమే తిరిగి వచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

 

ఒక్క వుహానే కాదు.. రాజధాని బీజింగ్‌లో ఇంకా భయం నీడలు పోలేదు. ఇంతకుముందులా వైరస్‌ ప్రభావం చూపడం లేదని

 

మరింత సమాచారం తెలుసుకోండి: