సరదా కోసం ఒక యువకుడు చేసిన పని అతడిని  కటకటాల వెనక్కి నెట్టింది . అందరూ అన్నదానం చేస్తుంటే , భిన్నంగా ఉంటుంది కదా ...  అని ఒక యువకుడు రోడ్డు పక్కన ఉన్న వారికి  మద్యం దానం  చేశాడు . మద్యం దానం చేయడమే ఆ యువకుడు చేసిన  తప్పయింది . అతనిపై సరూర్ నగర్ ఎక్సయిజ్ పోలీసులు కేసు నమోదు చేసి   అదుపులోకి తీసుకున్నారు . కరోనా కట్టడి లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యం లో మద్యం దుకాణాలను కూడా  మూసివేశారు .

 

దీనితో, మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మద్యం దొరకక కొంతమంది ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం దుకాణాలను తక్షణమే తెరిచి విక్రయాలు కొనసాగించాలన్న డిమాండ్లు మందుబాబుల నుంచి విన్పిస్తున్నాయి . రాష్ట్ర ఖజానా కు గండిపడుతున్న మందుబాబుల డిమాండ్లను ప్రభుత్వం తోసిపుచ్చుతూ , కరోనా కట్టడికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్ సర్కార్ చెప్పకనే చెబుతోంది . లాక్ డౌన్ సమయం లో కొంతమంది అన్నదానం , ఆహార ధాన్యాలు , కూరగాయలు సరఫరా చేస్తూ అందరి మన్నలను పొందుతున్నారు . నగరం లోని  చంపాపేట ప్రాంతానికి చెందిన ఓ  యువకుడు వారి నుంచి ప్రేరణ పొందడేమో తెలియదు కానీ తాను అందరికి భిన్నంగా ఏదో ఒకటి చేయాలని తలిచినట్లు ఉన్నాడు .

అందుకే  కుమార్ అనే యువకుడు చంపాపేట ప్రాంతం లో మద్యం ఫుల్ బాటిల్ చేత పట్టుకుని , పలువురికి మద్యం దానం చేస్తూ హల్ చల్ చేశాడు . ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ కావడం తో తెలంగాణ ఎక్సయిజ్ పోలీసులు స్పందించారు . నిబంధనలను ఉల్లఘించిన కుమార్ పై కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు . ఎవరైనా సరే సరదాకైన నిబంధనలను ఉల్లంఘిస్తే కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని ఎక్సయిజ్ అధికారులు హెచ్చరించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: