కరోతిన్ అప్డేట్; కొంత సడలింపు కోరుతూ ...మోడీకి సీఎం జగన్ లేఖ!!!
21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగుస్తుండడంతో సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రధాన మంత్రికి లేఖ రాశారు. వివిధ రంగాలపై  లాక్ డౌన్ ప్రభావాన్ని వివరిస్తూ వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలపై కొంత సడలింపు కావాలని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ దేశ ఆర్ధికాభివృద్ధిపై ప్రభావం చూపిందని.. డిమాండ్, సఫ్లై చైన్‌కు తీవ్ర ఆటంకం కలిగించిందని అందులో పేర్కొన్నారు.ఆర్థిక రధచక్రాన్ని కనీస వేగంతో పరిగెతించడానికి కొన్ని సడలింపులు కావాలని ఆ లేఖలో కోరారు. సిమెంటు, స్టీలు, గార్మెంట్స్, పుట్‌వేర్, ఆటోమోటివ్‌ తదితర రంగాలు లిక్విడిటీ, క్యాష్‌ ప్లో సమస్యను ఎదుర్కొంటున్నాయని వీటిని నేషనల్ హైవేలతో పాటుగా రైల్వే లతో కూడా రవాణా ప్రారంభించేలా సడలింపులు ఇవ్వాలని కోరారు .

 

ఆక్వా ఎగుతులు కోసం అమెరికా, యూరప్, ఆగ్నేయ ఆసియా దేశాల్లో లో మార్కెట్లు ఓపెన్‌ అయ్యేలా కేంద్రా వాణిజ్య శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రము కావున , రాష్ట్ర జీడీపీ లో వ్యవసాయం 34 శాతం కాగా .60 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ దాని అనుబంధ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా డిమాండ్ సప్లై చైన్ కి తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు , ఉద్యానవన మరియు రవాణా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: