రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకు ఎంత స్పేస్ ఉందన్నది ఇపుడు ఆలోచన చేయాలి. ఇప్పటికి ఎన్నికలు అయి ఏడాది గడచిపోయింది. ఈ ఏడాదిలో జనసేనాని నుంచి జగన్ కు ఎదురైన బిగ్ షాక్ ఏంటి. మోడీ జగన్ కి ఇచ్చిన్ షాక్ ఏంటి. జగన్ మోడీ మధ్యలో పవన్..

 

ఇదంతా ఒక పొలిటికల్ మిస్టరీగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా బలమంతా రాజకీయాలు వాడేశాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మాదిరిగా ఇతరులకు తన సినీ తపస్సు ఫలితాలను వాడేసి 2014 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చిన పవన్ తాను 2019 ఎన్నికలో గెలవడానికి చూస్తే మాత్రం తపో ఫలం మొత్తం కరిగినీరు అయింది.

 

దాంతో మళ్ళీ సినీ వనానికి చేరాడు. అయితే ఈసారి పవన్ ఒక తెలివైన ఎత్తుగడ వేశాడు. అదే బీజేపీతో పొత్తు. కానీ పవన్ అనుకున్న విధంగా ఏపీలో జనసేన, బీజేపీ పొత్తుతో బ్రహ్మాండం బద్దలు కావడంలేదు. అదే సమయంలో పవన్ చరిష్మా పొలిటికల్ గా పెరగడంలేదు.

 

మరో వైపు చూసుకుంటే జగన్ కి మోడీ మద్దతు ఉందని అడుగడుగునా స్పష్టం అవుతోంది. మోడీ ఏపీలో జగన్ కి అండగా ఉంటున్నాడని జనసేన అనుమానిస్తోంది.  అదే నిజం అవుతోంది. దాతో పవన్ తో కలసి ఏపీ బీజేపీ పోరాటానికి కలసి రావడంలేదని జనసేన మధన పడుతోందిట.

 

మొత్తం మీద చూసుకుంటే ఒంటరిగానూ ఫలితం లేదు. బీజేపీతో కలసినా సుఖం లేదు. ఏపీలో సీన్ చూస్తే మళ్ళీ వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే ఉంది. దాంతో జనసైనికులకే కాదు, పవన్ కి కూడా ఏం చేయాలో అర్ధం కావడంలేదుట. 

 

 ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశాన్ని నెట్టి జగన్ని ఎదిరించి 2024 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుందామన్న జనసేనాని ఆశలకు కమలం అడుగడుగునా బ్రేకులు వేస్తోందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: