దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. సోమవారం ఒక్క‌రోజే సాయంత్రం 5 వరకు  దేశంలో కొత్తగా 905 కేసులు నమోద‌య్యాయి. 51 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 324కు పెరిగింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 9,352కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 8,048 మంది చికిత్స పొందుతుండగా.. 979 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. 

 

మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావ‌డం ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తున్న తీరుకు నిద‌ర్శ‌నం. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు 11 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్పటికే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో కొన‌సాగుతోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలు దాటాయి. తాజా కేసులతో కలిపి 2,334కు చేరుకున్నాయి. మహారాష్ట్రలో కరోనా ప్రభావిత నగరాలుగా ముంబై, పుణె ఇప్పటికే విలవిలలాడుతున్నాయి. 


ఇదిలా ఉండ‌గా ఒక్క ముంబై మ‌హా న‌గ‌రంలోనే సోమ‌వారం 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా మృతుల సంఖ్య 100కు చేరింది. ముంబైలో మొత్తం ఇప్పటివరకూ 1549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో లాక్‌ డౌన్‌ పొడిగించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. తాజాగా తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరింది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: