కరోనా వైరస్ ని కట్టడి చేయటానికి అగ్రరాజ్యం అమెరికా అదే విధంగా అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలు ముప్పుతిప్పలు పడుతున్న విషయం అందరికీ తెలిసినదే. అమెరికా మరియు ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ వల్ల అనేక మరణాలు సంభవించాయి. వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అంటువ్యాధిగా ప్రబలుతున్న ఈ వైరస్ కి మందు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మరణాలు సంభవించగా లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా భారతదేశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేయటంతో ఈ వైరస్ ప్రబలకుండా కంట్రోల్ లో ఉంది. కాగా వైరస్ కంట్రోల్ విషయంలో, అదేవిధంగా లాక్ డౌన్ ను అమలు చేయటంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

 

దేశవ్యాప్తంగా ప్రముఖ జాతీయ  ఛానల్ ఎన్.డి.టి.వి.నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆ టీవీ వారు ఎపిలో కేసులు పెరిగి ఆ తర్వాత తగ్గుతున్న తీరుపై గ్రాఫ్ చూపుతూ ఎపిలో లాక్ డౌన్ విజయవంతంగా ఉందని అబినందించింది.దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎపి తర్వాత కేరళకు రెండో స్తానం వచ్చింది.కరోనా వైరస్‌ కట్టడికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగలేదని ఎన్డీ టీవి పేర్కొంది.

 

లాక్‌డౌన్‌ను పగడ్భందీగా అమలు చేసి కరోనా వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ప్రశంసించింది. ఎన్డీ టీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల ద్వారా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో హైలెట్ కావడంతో...కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: