ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాలకు పైగానే కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా మరియు యూరప్ వంటి దేశాలలో ఈ వైరస్ చాలా బలంగా ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలో మొన్నటి వరకు అమెరికా ముందు ఉండగా ఇప్పుడు తాజాగా మరణాల విషయంలో కూడా అమెరికా మొదటి స్థానం లోకి వచ్చింది. ఎక్కువగా ఈ వైరస్ వల్ల నష్టపోయిన దేశాలు ఇవే అంటూ అంతర్జాతీయస్థాయిలో అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ పేర్లు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఈ వైరస్ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం కూడా జరిగింది.

 

అయితే ప్రపంచంలో అన్ని దేశాలలో దాదాపు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నాగాని కొన్ని దేశాల్లో మాత్రం అసలు ప్రభావం ఏమి పెద్ద గా కనపడటం లేదు. వాటిలో ఎక్కువగా వినబడుతున్నాయి పేర్లు న్యూజిలాండ్.. ఫిన్ లాండ్.. ఐస్ లాండ్.. బెల్జియం.. డెన్మార్క్. ఈ దేశాలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పెద్దగా కనబడటం లేదు. అయితే తీవ్రత తక్కువగా ఉన్న ఈ దేశాలలో కామన్ పాయింట్ ఏమంటే.. దేశాధ్యక్ష స్థానంలో కానీ ప్రధాని స్థానంలో కానీ మహిళలు ఉండటం.

 

మహిళలు పరిపాలిస్తున్న దేశాలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పెద్దగా ఉండటం లేదు. మొత్తంమీద అంతర్జాతీయ స్థాయిలోకరోనా వైరస్ కట్టడి చేయడంలో మహిళా నాయకులు ముందు ఉన్నారన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు రావడంతో నెటిజన్లు ఈ వార్తలు విని  ఓరినీ ఇదెక్కడి లాజిక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.



 క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: