కరోనా విస్తృతి నేపధ్యం లో బ్యాంక్ ల నుంచి తీసుకున్న రుణ వాయిదాలను   మూడు నెలల పాటు చెల్లించక్కర్లేదన్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) ఆదేశాలను బ్యాంకులు పట్టించుకోవడం లేదు . బ్యాంకుల ద్వారా   ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగులు  తీసుకునే  వేతనాల నుంచి రుణ వాయిదాలను యధావిధిగా మినహాయించుకుంటూ , ఆర్బీఐ ఆదేశాలను వెక్కిరిస్తున్నాయి .  కరోనా విస్తృతి నేపధ్యం లో  ఒకవైపు ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల్లో  సంస్థలు  కోతలు విధిస్తున్న సమయం లో రుణవాయిదాల చెల్లింపుపై ఆర్బీఐ మారిటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడంతో , వేతన జీవులు కాసింత  ఊపిరి పీల్చుకున్నారు .

 

కానీ ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకులు తేలిగా తీసుకుని , వేతనాల  నుంచి రుణవాయిదాలను మినహాయించుకోవడం పట్ల  వేతనజీవులు గగ్గోలు పెడుతున్నారు . రుణ వాయిదాలపై ఆర్బీఐ మారిటోరియం ప్రకటించడం తో , మూడు నెలల పాటు రుణ వాయిదాల నుంచి విముక్తి లభిస్తుందని భావించిన వేతన జీవులకు , తమ ఖాతాల్లోని నిల్వలను చూసుకుని హతాశులవుతున్నారు .  ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా  బ్యాంకులు తమ రుణ వాయిదాలను వేతనం నుంచి మినహాయించుకోవడం పట్ల  అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ , ఇదే విషయమై బ్యాంక్ అధికారులను సంప్రదించగా వారు పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది .  వేతనం నుంచి ఈఎంఐ ను మినహాయించాలంటే , బ్యాంక్ కు వచ్చి అధికారులిచ్చే దరఖాస్తును పూరించాల్సి ఉంటుందని చెబుతున్నట్లు  సమాచారం . 

 

అలాగైతేనే మూడు నెలల పాటు రుణ వాయిదా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి వేతనాన్ని పొందే వెసులుబాటు లభిస్తుందని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారని పలువురు చెప్పుకొచ్చారు .   అయితే ఇప్పటికే చాలామంది ఆన్ లైన్ లో బ్యాంక్ అధికారులు సూచించిన దరఖాస్తు పత్రాన్ని పూరించినా , వేతనాల నుంచి ఈఎంఐ లను కట్  చేయడం పట్ల పలువురు  వేతనజీవులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: