దేశంతోపాటు రాష్ట్రం లో కూడా కరోనా విజృంభిస్తుందని ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సాయం కింద పేదలకు ప్రతి ఒక్కరికి 12కిలోల రేషన్ బియ్యం అలాగే రేషన్ కార్డు వున్న కుటుంబాలకు రూ.1500 ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 87శాతం బియ్యం పంపిణీ అయిపోయిందని పేర్కొన్నమంత్రి కేటీఆర్.. నేడు 74 లక్షల మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ కానుందని.. ఇందుకోసం ప్రభుత్వం 1,112 కోట్ల రూపాయలను బ్యాంకులకు బదిలీ చేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
 
ఇదిలావుంటే నిన్న ఒక్క రోజే ఏకంగా 61 కొత్త కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఎక్కువ శాతం జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదు కావడం తో హైదరాబాద్ ను జోన్లు గా విభజించి ఒక్కో జోన్ కు ఒక్కో అధికారిని నియమించాలని కేసీఆర్ ,మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఇక ఈకొత్త గా నమోదైన కేసుల తో కలిపి తెలంగాణ లో నిన్నటి వరకు కరోనా కేసుల సంఖ్య 592 కు చేరగా 17మంది మరణించారు. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 10000కు పైగా కరోనాకేసులు నమోదు కాగా నిన్నఒక్క రోజే  రికార్డు స్థాయిలో1000కి  పైగా కేసులు నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: