ఏపీ సీఎం జగన్ ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న అతనిపై పరోక్ష పద్దతిలో వేటు వేశారు. అభిశంసన వంటి దీర్ఘకాల ప్రక్రియ ద్వారా కాకుండా.. అతని పదవీకాలం కుదింపు ద్వారా పక్కకు పెట్టేశారు. అతనిని పదవి నుంచి తొలగించేశారు. ఆయన స్థానంలో మాజీ హైకోర్టు జడ్డి కనగరాజ్‌ ను యుద్ధ ప్రాతిపదన నియమించారు. 

 

 

ఆ కొత్త ఎన్నికల కమిషనర్ గా ఎన్నికైన కనగరాజ్ కూడా వెంటనే తమిళనాడు నుంచి వచ్చి తన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇన్నాళ్లూ నిమ్మగడ్డను వెనకేసుకు వస్తున్న  టీడీపీ ఈ దెబ్బతో బాగా షాకయ్యింది. కనగరాజ్ నియమాకం అక్రమం అంటూ గగ్గోలు పెడుతోంది. ఇది నిబంధనలకు విరుద్దంగా జరిగిందంటూ న్యాయ పోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించింది. 

 

 

ఇదిలా ఉంటే.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తన నియామకంపై స్పందించారు. టీడీపీకి షాక్ ఇచ్చారు. తన నియామకం పూర్తిగా చట్టబద్దమని కొత్త కమిషనర్ వి.కనగరాజ్ అన్నారు. ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ మీ నియామకం చట్టబద్దమేనా అని ప్రశ్నించగా డెఫినిట్లి సర్... అంటూ బదులిచ్చారు. మామూలుగా అయితే ఈసరికి ఎన్నికలు పూర్తి అయి ఉండేవని అన్నారు. అయితే ఈ సమయంలో మిగిలిన ప్రాసెస్ ఎదైనా ఉంటే పూర్తి చేసుకుని... సాధారణ పరిస్థితి రాగానే ఎన్నికలు నిర్వహించవలసి ఉందని అన్నారు.

 

 

ఇది ఒక రకంగా టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎప్పుడు సాధారణ వాతావరణం ఏర్పడితే అప్పుడు స్థానిక ఎన్నికల పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమనే సంకేతాలు కనగరాజ్ ఇచ్చేశారు. అందరి దృష్టి ఇప్పుడు కరోనా కోవిడ్ 19 ని అరికట్టడంపైనే ఉందన్న కనగరాజ్ అది అత్యవసరం కూడా అని ఆయన చెప్పారు. ఒక రాష్ట్రం, దేశం అని కాకుండా ప్రపంచం అంతా కరోనా అరికట్టడంపైనే కృషి చేయాలని కనగరాజ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: