ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ పొడిగింపు గురించి కీలక ప్రకటన చేయనున్నారు. ప్రధాని మోదీ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మూడు వారాల క్రితం లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేటితో లాక్ డౌన్ గడువు ముగియనుంది. కేంద్రం ఏప్రిల్ 14 లోపు కరోనా అదుపులోకి వస్తుందని భావించినా వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
దీంతో కేంద్రం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించనుందని తెలుస్తోంది. కేంద్రం ఏప్రిల్ 14 తర్వాత విధించే లాక్ డౌన్ ను కొందరు లాక్ డౌన్ 2.0 అని మరికొందరు స్మార్ట్ లాక్ డౌన్ అని పేర్కొంటున్నారు. కేంద్రం లాక్ డౌన్ 2.0 లో ప్రజలకు చాలానే సడలింపులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందని భావించి లాక్ డౌన్ ను పొడిగిస్తూనే ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే దిశగా అడుగులు వేయనుందని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ 2.0 లో కేంద్రం ప్రధానంగా ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చనుంది. కేంద్రం సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు రోడ్లపైకి రావడానికి అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. పరిశ్రమల విషయంలో మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని... లాక్ డౌన్ వల్ల మూతబడ్డ పరిశ్రమలకు నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నారని సమాచారం. 
 
కేంద్రం లాక్ డౌన్ వల్ల పరిశ్రమలకు భారీ నష్టాలు రావడంతో పని వేళలు పెంచుకునేందుకు అవకాశం కల్పించనుందని తెలుస్తోంది. కరోనా కేసులు నమోదు కాని గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం లాక్ డౌన్ ను ఎత్తివేయనుంది. పరిమిత సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కు కేంద్రం అనుమతి ఇవ్వనుందని సమాచారం. మోదీ ప్రజలకు కొన్ని సడలింపులు ఇస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: