ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా.. దీనివల్ల ప్రపంచ దేశాల తలరాతలే మారిపోయాయి.. ఇక ప్రజల జీవితాలైతే ప్రాణభయంతో, అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నాయి.. కానీ కరోనా వల్ల జీవితంలో నేర్చుకోలేమనుకున్న చాలా విషయాలు ప్రతి వారు నేర్చుకుంటున్నారు.. దాంతో పాటే మరికొన్ని కఠోర నిజాలు బయటపడ్డాయి.. అదేమంటే నేడు అమెరికా ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం కాదు అన్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.. ఎందుకంటే అక్కడ కావలసినంత డబ్బు ఉంటుంది.. విలాసవంతమైన జీవితం దొరుకుతుంది.. కానీ మనుషుల ప్రాణాలకు విలువ లేదు.. అది కరోనా వైరస్ విషయంలో అమెరికా నిరూపించుకుంది..

 

 

ఇకపోతే చైనా ప్రపంచ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించదు అనే నిజాన్ని అందరు ఒప్పుకోక తప్పదు.. ఆ దేశంలో ఈ లక్షణాలు బయటపడ్దప్పుడే ప్రపంచ దేశాలను హెచ్చరించి తగిన చర్యలు తీసుకుంటే ఈరోజు పరిస్దితులు ఇలా చేయిదాటి పోయేవి కావు.. ఇక ఈ కరోనా వల్ల బయటకు వచ్చిన మరికొన్ని నిజాలను గమనిస్తే.. మిగతా ప్రపంచదేశాల ప్రజలకంటే భారతీయులకు ఉన్న రోగ నిరోధక శక్తి ఎంతో శక్తివంతమైనది.. ఇప్పటివరకు సెలవులను ఏదేశాల్లో ఎంజాయ్ చేయాలో ప్రణాళికలు చేసుకునే ప్రపంచంలోని ప్రజలు తమ సెలవులను తమ కుటుంబంతో ఎంతో ఆనందంగా ఇంట్లోనే గడపగలరని తెలిసింది.. ఇక ఈ కరోనా వైరస్ బారిన పడ్ద ఏ ఒక్క రోగిని.. ఏ పాస్టరు, స్వామీజీ, పీఠాధిపతి, మతాధికారి, సిద్ధాంతి, జ్యోతిష్కుడు, పూజారి లాంటి వాళ్ళెవరూ రక్షించలేరని తేలిపోయింది..

 

 

ఈ సమయంలో నిజమైన హీరోలుగా నిలిచిన వారు వైద్య ఆరోగ్య సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మాత్రమే కానీ లీడర్లు, క్రికెటర్లు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, కాదని.. వీళ్లంతా కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే అని తేలిపోయింది.. ఇకపోతే ప్రపంచంలో వినియోగం లేకపోతే బంగారం, వజ్రాలకు కూడా ప్రాముఖ్యత తగ్గిపోతుందని తెలిసింది. ఇక ఆఫీసులకు వెళ్లకుండా ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చని నిరూపించారు. ఇదేగాక పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ఏ మాత్రం కష్టమైన పని కాదు అనేది అందరికీ బుర్రకెక్కింది.

 

 

మన దేశానికి కనీస మద్దతునివ్వని కొన్ని పనికిమాలిన కంపెనీలను మనం పెంచి పోషించాల్సిన అవసరం లేదని భారతీయులందరు తెలుసుకున్నారు. అదీగాక భారతీయ మహిళల కారణంగా ఇంటిని ఆలయంగా ఎలా ఉంచుకోవాలో పరాయి దేశం నేర్చుకునేటట్టు చేసింది. ముఖ్యంగా డబ్బుకు విలువ లేదు, ఎందుకంటే ఈరోజు మీరు పులుసుతో అన్నం తిని కూడా బతకొచ్చు అనేది నిరూపించబడుతుంది.. ఇప్పటివరకు భారతీయులు కుల, మత, ధనిక, పేద భేదాలతో ఎక్కువగా కీచులాడుకుంటారన్న ఇతర దేశాల అపోహ పటాపంచలు అయ్యింది. అన్నీటికంటే ముఖ్యమైనది భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలడని ప్రపంచ దేశాలతో ఎలుగెత్తి చాటబడింది.. సో ఈ జీవితాన్ని ఇలాగే అలవాటు చేసుకుంటే ప్రతి మనిషి జీవితం ఎప్పుడు కన్నీళ్లతో, బాధలతో సాగకుండా, ఉన్నదాంట్లో ఆనందంగా జీవించగలడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: