క‌రోనా వ్యాప్తి గురించే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు వింటూ వ‌స్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ తీపి క‌బురు కూడా చెప్పింది. అందేదేంటంటే.  గడిచిన రెండు వారాల్లో 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.రెండు వారాల కింద‌ట కరోనా వైరస్ కేసులు నమోదైన 25 జిల్లాల్లో ఇప్పటి వ‌ర‌కు కొత్త‌గా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది.  దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగినా 25 జిల్లాల్లో మాత్రం తోక ముడిచినట్లుగా అధికారులు గుర్తించారు. 

 

వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రకటరీ లవ్ అగర్వాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ ఘ‌న‌త సాధించిన రాష్ట్రాల్లో కేరళ, మణిపూర్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, గోవా, మిజోరాం, పుదుచ్చేరి, పంజాబ్, బిహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. గ‌డిచిన రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లో వైర‌స్ వ్యాప్తి చెంద‌క‌పోగా గ‌తంలో వైర‌స్ బారిన ప‌డిన చాలామంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్న‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. తెలంగాణ‌లో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మార్చి 24త‌ర్వాత ఒక్క కేసు కూడా కొత్త‌గా న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇదే విష‌యాన్ని ల‌వ్అగ‌ర్వాల్ మీడియా ప్ర‌తినిధుల ఎదుట గుర్తు చేస్తూ స్థానిక క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డిని అభినందించారు. ఇదిలా ఉండ‌గా దేశంలో సోమవారం రాత్రికి గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 905 కేసులు నమోదు కాగా, 51 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు క‌రోనాతో దేశంలో మరణించిన వారి సంఖ్య 324కు పెరిగింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 9,352కు చేరుకుంది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 100మందికిపైగా అక్క‌డ మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. వైద్యులు కూడా అధిక సంఖ్య‌లో క‌రోనా బారిన‌ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: