దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోదీ పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయల నగదు ఖాతాలలో జమ చేయనుంది. దాదాపు 74 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. 
 
కేంద్ర ప్రభుత్వం గృహావసరాల కోసం 5 కిలోల సిలిండర్ వినియోగించే వినియోగదారులకు 8 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు 8 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ ను మరికొన్ని వారాలు పొడిగిస్తే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 20,000కు పైగా జనతా బజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలలో పాలు, పళ్లు, కూరగాయలను నిల్వ చేసి ప్రజలకు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వీటి నిర్వహణను అప్పగించే అవకాశంఉందని తెలుస్తోంది. 
 
ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు.    
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: