ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని అందరం కరచాలనం చేయడం దాదాపు మానేశాం అనుకోండి. కాకపోతే కరచాలనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కరచాలనం చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా వారి సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా వారి చేతులను శానిటరీ ఉపయోగించి క్లీన్ చేసుకోవాలిగా అనేకమంది సూచిస్తున్నారు. మరికొందరు కరాచలనం బదులు మన దేశ సంస్కృతి చాటి చెప్పే లాగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మంచిదని చెబుతున్నారు.

 

 

అయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా వైరస్ కి దూరంగా ఉండుటకు సిరిసిల్ల విద్యార్థిని ఒక సెన్సార్ స్మార్ట్ వాచ్ ను రూపొందించింది. మనలని అప్రమత్తం చేసిన ఒక సెన్సార్ ఉంచిన స్మార్ట్ వాచ్ ని రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని. కరుణ వైరస్ వ్యాప్తి చెందకుండా కరచాలనం చేయవద్దని అలాగే చేతితో కళ్ళని, నోటిని, ముక్కుని ముట్టుకోవద్దని వైద్యులు చెబుతున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలవాటులో పొరపాటుగా మన చేతిని ముఖాన్ని ఎప్పుడు తాకుతూనే ఉంటుంది. ఇది పొరపాటు ని లక్ష్యంగా చేసుకొని ఒక విద్యార్థిని స్మార్ట్ వాచ్ ను తయారు చేసింది. ఆ విద్యార్థిని ఎవరో కాదు సిరిసిల్ల జిల్లాకు చెందిన బుధవారపు స్నేహ.

 

 


స్నేహ BSC ఎలక్ట్రానిక్స్ చదువుతోంది. ఈ వాచ్ ను రూపొందించడానికి సెన్సార్స్ ను డివైస్ కు అనుసంధానం చేసింది. మనం కరచాలనం చేయబోయిన లేదా ముక్కు నోరు, కళ్లను ఏదైనా తాకడానికి వెంటనే ఆ సెన్సార్ గుర్తించి ఒక శబ్దాన్ని చేస్తుంది. దీనితో మనము ఆచరించి అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. అయితే స్నేహ తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్ ని తయారు చేసినట్లు తెలుపుతుంది. స్నేహ చేసిన కృషిని జిల్లా అధికారులు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: