కరోనా వైరస్... ఈ వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ప్రపంచంలో లక్షకు పైన మృత్యువాత పడ్డారు అంటే ఈ వైరస్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ని అరికట్టడానికి భారతదేశం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీని కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ వ్యవస్థని ఏర్పాటు చేసి ఎవరికి వారు వారి ఇంటిలోనే ఉండేలా చేసింది. ఈ దెబ్బతో రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయింది. దీనితో ఎవరు బయటికి రాలేని పరిస్థితి క్లియర్ గా ఏర్పడింది. ఈ లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. కాకపోతే ఇది మన మంచి కోసమే ప్రభుత్వం చేయడంతో అందరూ దీనికి సహకరిస్తున్నారు. కరోనా వైరస్ ని అడ్డుకోవాలంటే కేవలం లాక్ డౌన్ ఒకే ఒక మార్గం. కాబట్టి ఇది అనివార్యం అని చెప్పవచ్చు.

 


ఈ పరిస్థితుల్లోనే ముంబైలోని బాద్రాలో నివసిస్తున్న రేణు కుమారి అనే ఒక మహిళ ప్రధాని మోదీకి ఒక  మెసేజ్ చేసింది. అందులో ఏమని ఉందంటే తనకు మూడున్నరేళ్ల కుమారుడికి ఒక అరుదైన వ్యాధి ఉందని అతనికి ఒంటె పాలు తప్పించి మరి ఏమి పడవని అయితే తన దగ్గర ఉన్న ఒంటె పాల పొడి కూడా అయిపోయిందని దీనితో నేను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని అయితే తన కుమారుని కాపాడాలని ప్రధానికి తన విన్నపాన్ని తెలిపింది.

 


అయితే ఈ తతంగం పై రైల్వే సిబ్బంది స్పందించి ముంబైలో మూడు రోజులకు సరిపడా పౌడర్ని ఆ మహిళకు అందజేశారు. అయితే ఆ తర్వాత ఒంటె పాలు రాజస్థాన్ లోని ఒక ఫోరంలో దొరుకుతాయి అని ఒక స్వచ్ఛంద సంస్థ వారికి తెలిపింది. దీనితో రైల్వే శాఖ వేగంగా స్పందించి పంజాబ్ లోని లూధియాన నుంచి ముంబై కి వస్తున్న గూడ్స్ రైలును రాజధానిలో దారి మళ్లించి ఒంటె పాలు పాలపొడి అందించే ఓ చిన్న రైల్వే స్టేషన్ కు రైలు ని తీసుకెళ్లారు. అక్కడే వాటిని ఆ రైలు ఎక్కించి ముంబైకి తీసుకువచ్చారు. దీనితో ఆమెకు 20 లీటర్ల పాల పొడిని అందించి ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ఏది ఏమైనా తన మెసేజ్ కు ఈ విధంగా స్పందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: