తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ దాడి పెరిగిపోతోంది. ఏకంగా  500 కేసులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం లో నమోదైన కేసులు సగానికి పైగా కేసులు జిహెచ్ఎంసి పరిధిలో నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

 

 

ఈ క్రమంలోనే నగరం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని జోన్ల వారీగా విభజించి కరోనా  వైరస్ నియంత్రణకు పర్యవేక్షించే అధికారులను నియమించాలి అంటూ సూచించారు. ఎక్కువగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాలను మరింత పకడ్బందీగా నిర్బంధాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 

 

 

 అయితే ఎలాంటి విపత్తు ఏర్పడినప్పటికీ అప్రమత్తంగా ఉండేలా వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అయితే  హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కరోనా   నియంత్రించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు గురించి ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి... ఇతరులకు తొందరగా రాకుండా ఉండేందుకు తగు చర్యలు చేపడుతుంది కెసిఆర్ సర్కార్ .

 

 

అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటి పోయే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో నగరంలో కరోనా కట్టడి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నగరానికి జోన్ల  వారిగా విభజించి ప్రతి ఒక జోన్ కి ప్రత్యేక వైద్య అధికారిని... పోలీస్ అధికారి... మున్సిపల్ అధికారి... రెవెన్యూ అధికారిని నియమించాలని కెసిఆర్ సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ నగరానికి మొత్తంగా  డిఎంహెచ్ఓ ఉన్నారు. కానీ కరోనా నేపథ్యంలో  జోన్ల వారీగా విభజించి ఒక్కొక్క జిల్లాకు ఒక అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే కరోనా  పాజిటివ్ కేసులు ఎక్కువ  వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో గుర్తించిన ప్రభుత్వం..  మొత్తం రాష్ట్రంలోని 246 కంటోన్మెంటు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఒక్క హైదరాబాద్ ప్రాంతంలో 126 కంట్రోల్ మెంట్ ప్రాంతాలు ఏర్పాటు చేసారు . కాగా  వీటిని ఎంతో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రాకుండా ఉండేందుకు... ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులను ప్రభుత్వమే అందించాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయించింది . 

 

 

 అంతేకాకుండా ఆయా జోన్లలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ప్రతిరోజు ఉదయం ఆయన అధికారులు  ప్రగతిభవన్లో సమీక్షలు జరపాలని పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు... సలహాలు ఇస్తూ ఉండాలి అంటూ సూచించారు. కరోనా ను  జయించడానికి ప్రజల సహకారంతో ముందుకు సాగాలని...  దీనికోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: