ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ విధానం అమలులోకి రావడంతో అన్ని రంగాలలో ఆర్థిక పరంగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రజలు కూడా ఎవరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఉండడంతో వారికి ఎటువంటి ఆదాయం లభించటం లేదు. దీంతో చాలామంది ప్రజలు అప్పులు చేయడం మొదలు పెడుతున్నారు. అప్పు చేసి మరీ కుటుంబాలను పోషించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి.  దీని కోసం ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు ప్రజలకు వారి వంతు సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

 

ఈ తరుణంలో ప్రభుత్వ బ్యాంకులు ప్రజలకు మంచి ఆఫర్ ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పూర్తిస్థాయిలో బ్యాంకు సర్వీసులు ఇప్పుడు పూర్తిగా జరగటం లేదు. అంతే కాకుండా ఐటీ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి. కనుక ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకింగ్ సహాయంతో వారికి రుణ సదుపాయం కలిగించాలని ప్రభుత్వ బ్యాంకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు పదివేల రూపాయల వేతనం ఉన్న వారికి 30 వేల వరకు రుణం ఇవ్వాలని ప్రభుత్వ బ్యాంకులు భావిస్తున్నారు. 

 

 

దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ని కానీ లేకపోతే యాప్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలోచనలు చేస్తున్నారు.  లక్ష రూపాయల వేతనం వచ్చేవారికి రెండు నుంచి మూడు లక్షలు వరకు రుణం ఇవ్వాలని అనుకున్నట్లు సమాచారం. దీనితోపాటు ఎవరికైనా క్రెడిట్ కార్డు ఉన్నవారికి వాళ్ల లిమిట్ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళ అకౌంట్లలో వాళ్ల జీతం ఆధారంగా అదనంగా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వ బ్యాంకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం విద్యారుణాలు తీసుకొని డబ్బులు కడుతున్న ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏదేమైనా కానీ ఒకరకంగా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: