ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరూ కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తూ  విలయ తాండవం చేస్తూ ఎంతో మందిని బలితీసుకుంది మహమ్మారి కరోనా. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నా ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇక ప్రపంచ దేశాల్లో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు కూడా కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. 

 

 

 అయితే కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రజలందరికీ ఎన్నో అనుమానాలు... ఎన్నో అపోహలు... మరెన్నో భయాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలామందికి కరోనా  వైరస్ ఎలా సోకుతుంది అనే విషయం స్పష్టంగా తెలియదు. ఇంకొంత మందికి తెలిసిన ఎలాంటి జాగ్రతలు పాటించాలి  అనే పూర్తి వివరాలు మాత్రం తెలియదు.

 

 

మామూలుగా అయితే కరోనా  వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు  వేరే వ్యక్తి పడడం లేదా ఏదైనా పాత్రపై పడితే  అక్కడ వేరే వ్యక్తి ముట్టుకుని ఆ తర్వాత ముక్కు కనులు నోరు  దగ్గర చేయి పట్టుకోవడం కారణంగా కరోనా  వైరస్ సోకుతుంది. అందుకే సామాజిక దూరం  పాటించడం వలన వైరస్  నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు వైద్యులు. 

 

 

 అయితే  ఓ మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డ కడుపులో ఉండగా ఆ మహిళ కి కరోనా వైరస్ సోకితే గర్భిణీ తల్లినుంచి గర్భంలో ఉన్న బిడ్డకు వైరస్ సోకే ప్రమాదం ఉందా లేదా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంటుంది. అయితే తాజాగా ఈ విషయం పై అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది.

 

 

ఒకవేళ గర్భిణీకి కరోనా  వైరస్ సోకితే గర్భంలో ఉన్న శిశువుకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది అంటూ తెలిపింది.   ప్రసవం అయిన తర్వాత కూడా బిడ్డకు కరోనా  వైరస్ సోకే అవకాశం ఉంది అంటూ వెల్లడించింది.  తల్లి నుండి బిడ్డకు డైరెక్ట్ గా కరోనా  సోకినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ తెలిపింది. అయితే తల్లిపాల ద్వారా కరోనా  సోకుతుంది అనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అంటూ చెప్పుకొచ్చింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.

 

 

అయితే ఇన్ని రోజుల వరకు తల్లి గర్భంలో ఉంటే సురక్షితంగా ఉండొచ్చు  ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకునేవారు... కానీ ఈ మహమ్మరి రక్కసి ప్రస్తుతం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా రక్షణ లేకుండా చేస్తుంది. కడుపులో పెరుగుతున్న శిశువు ఇంకా లోకాన్ని కూడా చూడకముందే పరలోకాలకు పంపించేందుకు కోరలు చాస్తుంది ఈ మహమ్మారి వైరస్.

మరింత సమాచారం తెలుసుకోండి: