దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత నెల 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు శక్తి వంచన లేకుండా తమ విధులు నిర్వహిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఇంటి పట్టున ఉంటే.. పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారు.  తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ తో ప్రజలకు సాయం చేసేందుకు నిత్యం  కష్టపడుతున్న హైదరాబాద్ సిటీ పోలీసులుకు  మూడు వేల లీటర్ల ఫ్రూట్ జ్యూస్ ను అందించారు.

 

కిషన్ రెడ్డి తరపున బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బషీర్ బాగ్ లోని సీపీ ఆఫీస్ లో అంజనీ కుమార్ కు అందించారు. పోలీసులు చేస్తున్న కృషికి యావత్ భారత్ సెల్యూట్ చేస్తుందని అన్నారు.  డాక్టర్లు ఎంతో ధైర్యం చేస్తూ ప్రజలను కరోనా మహమ్మారి భారిన పడకుండా ఒకవేళ ఆ వైరస్ వచ్చినా దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.  మరోవైపు  కరోనా కట్టడి చర్యలను ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్న కిషన్ రెడ్డి తన  తల్లి అండాళమ్మ సంవత్సరీకం నిర్వహించేందుకు  స్వగ్రామానికి రాలేకపోయారు.

 

దాంతో, ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన భార్య, సోదరులు, బంధువులు స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: