ప్రపంచంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం అంతా ఇంతా కాదు. అయితే ఈ కరోనా వల్ల మరణాలు, రోగుల సంఖ్య పెరిగిపోతున్న మాట వాస్తవమే అయినా.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన మూలంగా ఒక మంచి మాత్రం జరిగిందంటున్నారు.  నిత్యం రోడ్లపై హడావుడిగా ప్రయాణాలు.. ధ్వని, వాయు కాలుష్యం పూర్తిగా తగ్గిందని.. నీటి కాలుష్యం కూడా తగ్గిందని అంటున్నారు నిపుణులు.  ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా వాహనాలపై ప్రయాణాలు చేస్తూ ఆ పొగ నుంచి వచ్చే వాయువుతో ఏకంగా ఓజోన్ పొర చిల్లు పడే పరిస్థితి ఏర్పడింది.   

 

కరోనాతో ప్రాణాలు పోవడం ఒక్కటి బాధ అనిపిస్తుంది.  లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో 30 శాతం కాలుష్యం తగ్గింది. గాలిలో ధూళికణాలు తగ్గడం.. ఆక్సేస్ ఆఫ్ నైట్రోజన్ ఎన్‌వోయిస్ లెవెల్స్ తగ్గాయని, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో.. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాస్త్రవేత్త సత్యనారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గతంతో పోలిస్తే పొల్యూషన్ గణనీయంగా తగ్గిందన్నారు.

 

హైదరాబాద్‌లో 21 స్టేషన్లను పరిశీలిస్తున్నామని, మొత్తంగా చూస్తే చాలా తగ్గిందన్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగతో సగం గాలి విషపూరితం అవుతుంది.  అలాంటిది గత నెల 24 నుంచి లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంబించి పోయాయి. దాంతో శబ్ధ, వాయు, నీటి కాలుష్యం పూర్తిగా అరికట్టబడింది. మేజర్ ట్రాఫిక్ సెంటర్లలో పొల్యూషన్ బాగా తగ్గిందని సత్యనారాయణ పేర్కొన్నారు.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: