కరోనా దెబ్బతో ఆన్‌లైన్ టీచింగ్‌కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. భారత్ పడే ఆన్‌లైన్‌ పేరుతో డ్రైవ్ మొదలు పెట్టింది. కరోన దెబ్బతో ఈ లెర్నింగ్ కి ప్రాధాన్యత పెరిగింది...HRD ఈ లెర్నింగ్ వెబ్సైట్ లకు గిరాకీ పెరిగింది... ఎఫెక్టివ్ గా ఉండేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది... రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపున అడుగులు వేస్తోంది.

 

కరోనe దెబ్బ విద్యా వ్యవస్థ పై ఘోరంగా పడింది. లాక్ డౌన్ ఎత్తేసినా విద్యా వ్యవస్థ గాడిలో పడేలా లేదు. తరగతులు జరిగేలా కనిపించడం లేదు. ఒక గుంపులుగా ఉండే దేనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేదు.ఈ గండం నుండి గట్టెక్కేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ లెర్నింగ్ కి ప్లాన్ చేస్తున్నాయి. ఆన్ లైన్ లో తరగతులు ఏర్పాటు చేశాయి. ఉన్నత విద్యా, హైయ్యర్ సెకండరీ క్లాసు లకు ఆన్ లైన్  టీచింగ్ కోసం రెండు కమిటీలను వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా బాగా ఉండేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరింది. ఈ నెల 16 వరకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. మరో వైపు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఈ క్లాసెస్ ప్రారంభం అయ్యాయి. HRD వెబ్ సైట్ లకు గిరాకీ పెరిగింది.స్వయం ప్రభ dth టీవీ చూసే వారి సంఖ్య 6.8 కోట్లకు చేరింది. స్వయం ఈ లెర్నింగ్ ప్లాట్ఫార్మ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 5 రేట్లు పెరిగింది.. నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఆన్ లైన్ లో చూస్తున్న వారి సంఖ్య పెరిగింది. సెకండరీ, హయ్యర్ సెకండరీ క్లాసెస్ లు స్వయం వెబ్ సైట్ ద్వారా బోధిస్తున్నారు..

 

తెలంగాణ లోను T sat ద్వారా తరగతులు నడుస్తున్నాయి. 10వ తరగతి పరీక్షలు పూర్తికాక పోవడం తో పునశ్చరణ తరగతులు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు , కాలేజీలు ఆన్ లైన్  తరగతులు నిర్వహిస్తున్నాయి. అసైన్ మెంట్స్ కూడా ఇస్తున్నాయి. మార్చి నుండి జూన్ వరకు తరగతులు జరగకుంటే విద్యార్థులపై ప్రభావం పడుతుందని... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్ లైన్  పాఠాలు చెప్పాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయం లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నేతలు అంటున్నారు. వెంటనే విద్యార్ధుల కు గైడ్‌లైన్స్  ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 

 

యూనివర్సిటీల్లో కూడా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆన్ లైన్  తరగతులు నిర్వహించేందుకి ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి విద్యార్ధుల కు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లు, వీడియో రికార్డ్స్ ద్వారా పాఠాలు చెప్పాలని ఆదేశించింది. క్లాసెస్ ఒకే కానీ మరి పరీక్షల సంగతి ఎంటనే దాని పై చర్చ జరుగుతుంది... దీని కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు ఎలాంటి మార్గాలు వెతుకుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: