ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రాత్రి సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి . కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ డౌన్లోడ్ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తగు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం... రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిత్యావసరాల పంపిణీ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రం  లోని భవన నిర్మాణ రంగ కార్యకలాపాలను ఏప్రిల్ 15 నుండి  పునరుద్ధరించాలని యోగి  ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే తాజాగా తమ నిర్ణయం మార్చుకుంది యూపీ సర్కార్.  కరోనా విజృంభణ నేపథ్యంలో  పునరాలొచించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 

 

  భవన నిర్మాణ కార్య కలాపాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యూపీ సర్కార్  రద్దు చేసినట్లు ఉప  ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య  వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్  మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆయన. మొదట ఈ నెల 15 నుంచి భవన  నిర్మాణ రంగ కార్యకలాపాలను పునరుద్ధరించాలని యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది... కానీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది . 

 

 

 దేశంలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి... అందరి అభిప్రాయాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మే  3 వరకు పొడిగించేందుకు నిర్ణయించింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: