రోజు రోజుకు కరోనా  వైరస్ ప్రభావం భారత దేశంలో పెరిగిపోతునే  ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో భారత ప్రజలు అందరూ ప్రాణభయంతో నే బతుకును వెళ్లదీస్తున్నారు. కంటికి కనిపించని మృత్యువు ఎక్కడ దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అనే ప్రాణభయంతో బతుకుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ప్రాణాలను పణంగా పెట్టి మరీ దేశ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఏకంగా కుటుంబాలకు దూరంగా ఉండి మరి కరోనా  పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు వైద్యులకు కూడా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది . ఈ క్రమంలోనే ఝార్ఖండ్  అధికార యంత్రాంగం వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా  వైరస్ రోగులకు ఇకపై వైద్యులు నేరుగా ఆహరం  అందించకుండా రోబోల ద్వారా మందులు ఆహారం అందజేసేందుకు  నిర్ణయం తీసుకుంది ఝార్ఖండ్  అధికార యంత్రాంగం . జార్ఖండ్లోని వెస్ట్ సింగ్ బూమ్ జిల్లాలో కరోనా రోగులకు  చికిత్స అందిస్తున్న రెండు  ఆస్పత్రిలో.. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తుంది ఝార్ఖండ్ ప్రభుత్వం. 

 

 

 డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ఆదిత్య రంజన్  నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం.. కొబౌట్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన రోబోట్లను  కరోనా  వైరస్ సోకిన రోగులకు ఆహారం మందులు అందజేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇది రిమోట్ కంట్రోల్ ద్వారా మానవ ప్రమేయం లేకుండానే... కరోనా  బారినపడి చికిత్సపొందుతున్న రోగులకు ఆహారంతోపాటు మందులను కూడా సరైన సమయానికి అందజేస్తుంది. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే కరోనా పేషంట్ లకు  మందులు సహా ఆహారం రోబోలతో  అందించడం వల్ల చాలా మంది వైద్యులు కరోనా మహమ్మారి  నుంచి తప్పించుకునేందుకు వీలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: