చైనా ప్ర‌పంచ‌దేశాల్లో న‌మ్మ‌కం కోల్పోయింది. చీప్ అండ్ బెస్ట్ అనే మార్కెటింగ్ సూత్రంతో  చైనా త‌మ దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను ప్ర‌పంచం న‌లుమూలాల ఎగుమ‌తి చేస్తూ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే క‌రోనా త‌ర్వాత చైనా ఎగుమ‌తులు స‌న్న‌గిల్లుతున్నాయి. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉండి కూడా చాలా దేశాలు చైనాలో త‌యారైన వ‌స్తు సామాగ్రిని వెన‌క్కి తిప్పి పంపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒక్క‌టే క్వాలిలీ లేక‌పోవ‌డం. చైనా త‌యారు చేసిన వ‌స్తువుల్లో క్వాలిటీ లేద‌ని బ్రిట‌న్‌, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు వెన‌క్కి పంపండం విశేషం.  

 

యూరప్ దేశాలకు చైనా పంపిన మాస్కులు, టెస్టు కిట్లు బాలేదంటూ... ఆయా దేశాలు వెనక్కి ఇచ్చేయడంతో... చైనాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. దీంతో ఇప్పుడు కాస్త ప‌ద్ధ‌తి మార్చుకున్నా చైనా క్వాలిటీ వ‌స్తువుల‌ను త‌యారు చేసేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటోందని అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి అంత‌ర్జాతీయంగా క‌రోనా ప‌రిస్థితులు నెల‌కొన్న దృష్ట్యా అవ‌కాశాన్ని మార్కెట్‌కు అనుకూలంగా మార్చుకుని ఎక్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించాల ని చూసిన చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో డ్రాగ‌న్ కంట్రీ బుద్ధి తెచ్చుకుని నాణ్య‌మైన వ‌స్తువుల త‌యారీకి ఉప‌క్ర‌మిస్తోంద‌ని స‌మాచారం.


ఇదిలా ఉండ‌గా యాంటీబాడీ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కావాల‌ని ఇటీవ‌ల భార‌త్ చైనాకు ఆర్డ‌ర్ ఇచ్చింది. అయితే చైనాపైన పూర్తిగా న‌మ్మ‌కం ఉంచ‌క ప్ర‌భుత్వం మ‌రో మూడు దేశాల సాయం కూడా తీసుకుంటోంది.కేంద్ర ప్రభుత్వం చైనా కిట్ల కోసం ఎదురుచూడటం మానేసి... దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్ నుంచి తెప్పిస్తోంది. ఈనెల  ఏప్రిల్ 15న భారత్‌కి వచ్చే అవ‌కాశం ఉంద‌ని భార‌తీయ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిజానికి ఏప్రిల్ 8నే 7లక్షల కిట్లు రావాల్సి ఉంది. కానీ చైనా వాటిని తయారుచేశాక... క్వాలిటీ టెస్ట్ చేసినప్పుడు అవి సరిగా పనిచెయ్యలేద‌ని తేల‌డంతో వాటిని పక్కన పెట్టింది. డీల్ ప్రకారం చైనా... భారత్‌కి మొత్తం 45లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను పంపాల్సి ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: