ప్రపంచాన్ని కరోనాభూతం పట్టి పీడిస్తుంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బిటన్ లాంటి దేశాల్లో కరోనా మారణహోమం సృష్టిస్తుంది. ఇక మన దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 9,405కు చేరింది. ‘కరోనా’ బారిన పడి ఇప్పటి వరకు 335 మంది మృతి చెందగా, దీని నుంచి 1,109  మందికి పైగా కోలుకున్నారు.  మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2,604, ఢిల్లీలో1,154 కేసులు, తమిళనాడులో 1,075, రాజస్థాన్ లో 847, మధ్యప్రదేశ్ లో 562, తెలంగాణలో 531, ఏపీలో 432 కేసులు నమోదయ్యాయి. మరోవైపు క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో దీనిపై ప్ర‌జ‌ల‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసులు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  

 

ఈ నేపథ్యంలోనే కొంత మంది కరోనా వైరస్ ని తరిమికొట్టేందుకు ఇంట్లో ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలిని సూచిస్తూ వీడియోలు చేస్తున్నారు.  ఇక సెలబ్రెటీలు అయితే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది కళాకారులు కరోనా మహమ్మారి నుంచి ఎలా రక్షించుకోవాలి అని జాగ్రత్తలు తెలుపుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు.. ఇంకొంద‌రు స్టార్ హీరోల పోస్ట‌ర్స్‌తో అభిమానుల‌కి అవ‌గాహ‌న క‌ల్పించేలా వినూత్నంగా ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా పుణె పోలీసులు కరోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  కొత్త ప్రయోగం చేశారు. గ‌జిని సినిమాలో అమీర్ ఖాన్  పోస్ట‌ర్‌ని తీసుకొని అందులో హీరో ముఖానికి మాస్క్ త‌గిలించారు.

 

ఆ ఫోటోని త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏవైన మ‌ర‌చిపోండి కాని, ముఖానికి మాస్క్ త‌గిలించుకోవ‌డం, సామాజిక మాధ్య‌మం పాటించ‌డం, త‌ర‌చు చేతులు క‌డుక్కోవ‌డం మ‌ర‌చిపోవొద్ద‌ని పేర్కొన్నారు.  ప్రస్తుతం కరోనా వైరస్ ని జాగ్రత్తలు పాటిస్తూనే తరిమి కొట్టాలని.. ఎలాంటి అజాగ్రత్తలు, నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోవడం ఖాయం అంటున్నారు.   వీటి కోసం మీరు మీ శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకోవ‌ల‌సిన‌  అవసరం లేదు అని  ట్వీట్‌లో పేర్కొన్నారు పూణే పోలీసులు.  వీరి ప్ర‌య‌త్నాన్ని నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: