మన కడుపు మీద ఉండే నాభిని బొడ్డు అని కూడా పిలుస్తుంటారు. వాస్తవానికి ఈ నాభి తల్లికి బిడ్డకు మధ్య ఉన్న సంబంధం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి నాభీ ద్వారా మన శరీరంలో చాలా రకముల వ్యాధులకు వైద్యం కూడా చేస్తారు. అంతే కాదు రోజు నూనె రాయటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. చాలా వరకు చాలా మంది నాభిని అసలు శుభ్రపరుచుకోరు. 

 


ఇలా చేయకుండా ఉండడం వల్ల చుట్టూ ఉన్న సూక్ష్మక్రిములు కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నాభిపై నూనె వేసి మసాజ్ చేస్తే సూక్ష్మ క్రిములను క్లీన్ చేస్తుంది. ఒకవేళ ఇలా శుభ్రం చేయకపోతే లోపల బయట నుండి చాలా అంటువ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా అవకుండా ఉండడానికి ఆవ నూనె, టీ ట్రీ వంటనూనెలతో శుభ్రం చేసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు రావు అని తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి ఇలా చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు అనే చెప్పాలి. 

 


ఇంకా నాభి పై ఉన్న చిన్న రంధ్రం లాంటి ప్రదేశం చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. అంతేకాదు ఇది శరీరంలో ఉన్న చాలా అవయవాలకు కూడా కలిసి ఉంటుంది. దానితో బొడ్డుపై నూనె వేస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలను రాకుండా సహాయపడుతుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల మహిళలలో కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కీళ్ల నొప్పులు కూడా నయం అవుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా మనుషులు వారి శరీర భాగాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటె ఎలాంటి సూక్ష్మ జీవులు మనదెగ్గరికి రాకుండా ఉంటాయి. ముక్యంగా కరోనా వైరస్ లాంటివి దరి చేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: