అవును మరి బంధాలు అనుబంధాలు అన్నీ బయట వేరేగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం తేడాగా ఉంటాయి. విడిపోతే అది శాస్వతం కాదు, కలసి ఉన్నా అది ఎంతకాలంలో తెలియదు. మోడీని ఇంతవరకూ దేశంలో ఎవరూ తిట్టనంతంగా తిట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని చెప్పాలి.

 

అటువంటి చంద్రబాబు మోడీకి ఇపుడు ప్రేమలేఖలు రాస్తున్నారు. మోడీ శభాష్ అంటున్నారు. ఇదే చంద్రబాబు ఒకనాడు మోడీ లాంటి ఫెయిల్యూర్ ప్రధానమంత్రిని తాను ఇంతవరకూ చూడలేదని సెలవిచ్చారు. అంతే కాదు, మోడీ ఓడితేనే భారత్ బాగుపడుతుందని ఎన్నికల వేళ ప్రతీ చోటకు వెళ్ళి అక్కడ  ఊరూరా తిరిగి ఊదరగొట్టారు.

 

మరి ఇపుడు మోడీ గ్రేట్ అంటున్నారు. అవును మరి అక్కడ ఉన్నది చంద్రబాబు కదా. చంద్రబాబు ఇన్నాళ్ళూ మోడీకి రాసిన ప్రేమలేఖలకు ప్రతిఫలం ఇపుడు లభించిందని అంటున్నారు.

 

మోడీతో చాన్నాళ్ళ తరువాత టెలిఫోన్ సంభాషణ ద్వారా మాట కలిపారట. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పుకున్నారు. తాను మోడీతో మాట్లాడుతానని కొరితే పీఎంఓ కార్యలయం లైన్ కలిపిందని కూడా బాబు చెప్పారు.

 

తాను కరోనాను దేశంలో నియంత్రించడం కోసం మోడీ చేసిన పనులు లాక్ డౌన్ విధించిన విధానం అన్నీ కూడా చెప్పి మరీ మెచ్చుకున్నట్లుగా బాబు చెప్పారు. పనిలో పనిగా ఏపీలో జగన్ సరిగ్గా పనిచేయడంలేదని కూడా బాబు చెప్పి ఉండొచ్చు కూడా.

 

ఇవన్నీ పక్కన పెడితే మోడీతో మాట్లాడాను అని బాబు చెబుతున్నారంటే బాబు కాల్ ని మోడీ రిసీవ్ చేసుకున్నారంటే మళ్ళీ ఇద్దరూ చుట్టాలైపోయారా అన్న అనుమానాలు ఏపీ రాజకీయాల్లో  వస్తున్నాయి. ఈ కరోనా వైరస్ గొడవ తగ్గేక బాబు ఢిల్లీ టూర్  కూడా పెట్టుకున్నారట. అంటే అన్నీ కుదిరితే మోడీ అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది. మొత్తానికి మోడీతో బాబు దోస్తీకి బీజం పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: